ETV Bharat / sports

'సచిన్​ రికార్డును రూట్​ బ్రేక్ చేయడం పక్కా' - root record in srilanka test

టెస్టు క్రికెట్​లో అత్యధిక పరుగులు చేసిన భారత దిగ్గజ ఆటగాడు సచిన్​ తెందుల్కర్​ రికార్డును ఇంగ్లాండ్​ సారథి జో రూట్​ త్వరలోనే అధిగమిస్తాడని అన్నాడు కంగారూ జట్టు మాజీ ఓపెనర్​ జెఫ్రీ బాయ్​కాట్​. అతడికి ఆ రికార్డును త్వరలోనే చేరుకునే సామర్థ్యం, ప్రతిభ ఉన్నాయని కితాబిచ్చాడు.

root
రూట్​
author img

By

Published : Jan 26, 2021, 10:57 AM IST

ఇంగ్లాండ్​ సారథి జో రూట్​పై ప్రశంసలు కురిపించాడు ఆ దేశ మాజీ ఓపెనర్​ జెఫ్రీ బాయ్​కాట్​. ప్రపంచవ్యాప్తంగా టెస్టు క్రికెట్​లో 200 టెస్టులు ఆడి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అగ్రస్థానంలో కొనసాగుతోన్న భారత దిగ్గజ ఆటగాడు సచిన్​ తెందుల్కర్​​(15,921)ను అధిగమిస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. లిటిల్​ మాస్టర్​ రికార్డును తిరగరాసే సత్తా, ప్రతిభ రూట్​కు ఉన్నాయని కొనియాడాడు.

తాజాగా శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్​లో ఇంగ్లాండ్​ 2-0తేడాతో సిరీస్​ను కైవసం చేసుకుని ప్రత్యర్థి జట్టును వైట్​వాష్​ చేసింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన రూట్.. తొలి టెస్టులో డబుల్​ సెంచరీ, రెండో టెస్టులో సెంచరీతో రికార్డులను నెలకొల్పాడు. ఈ క్రమంలోనే తమ జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన జెఫ్రీ బాయ్​కాట్​, డేవిడ్​ గోవర్​(8,231), కెవిన్​ పీటర్సన్​(8,181)ను వెనక్కునెట్టి 8,238 పరుగులు చేసిన నాలుగో క్రికెటర్​గా నిలిచాడు. ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశాడు జెఫ్రీ.

"నన్ను, డేవిడ్​ గోవర్​, కెవిన్​ పీటర్సన్​ను అధిగమించి ఇంగ్లాండ్​ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రూట్​ రికార్డు నెలకొల్పాడు. దాన్ని మర్చిపోండి. అతడికి కెరీర్​లో 200 టెస్టులు ఆడే సత్తా ఉంది. సచిన్​ రికార్డును తిరగరాస్తాడు. రూట్​ వయసు 30ఏళ్లే. ఇప్పటికీ అతడు 99 టెస్టులు మాత్రమే ఆడి 8,249 పరుగులు చేశాడు. అతడికి ఏ గాయం కాకుండా కెరీర్​ సాఫీగా సాగితే తెందుల్కర్​(15,927) ఆల్​ టైమ్​ రికార్డును తప్పకుండా బద్దలకొడతాడు. అతడిని మాజీలతో పోల్చవద్దు. సమవుజ్జీలైన కోహ్లీ, స్మిత్​, కేన్​ విలియమ్సన్​ లాంటి అద్భుత ఆటగాళ్లతో పోల్చాలి. ఎందుకంటే ఆ కాలంలో వారు, ప్రస్తుత తరంలో వీరు గొప్ప ఆటగాళ్లు."

-జెఫ్రీ, బాయ్​కాట్​, ఇంగ్లాండ్​ మాజీ ఆటగాడు.

లాక్​డౌన్​ సమయంలో రూట్.. బ్యాటింగ్​పై బాగా దృష్టి సారించి ప్రాక్టీస్​ బాగా చేశాడని అన్నాడు జెఫ్రీ. అయితే ఆస్ట్రేలియా పేసర్లను ఎదుర్కోవడం అతడికి పెద్ద సవాలు లాంటిదని చెప్పాడు. ​

జనవరి 27న భారత పర్యటనకు రానుంది ఇంగ్లాండ్​. ఇందులో భాగంగా ఇరుజట్లు నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. తొలుత ఫిబ్రవరి 5న జరిగే టెస్టుతో పర్యటన ప్రారంభం కానుంది. మొదటి రెండు టెస్టులు చెన్నైలో జరగనుండగా, మూడోదైన డేనైట్ టెస్టుతో పాటు నాలుగో టెస్టుకు అహ్మదాబాద్ వేదిక కానుంది. తర్వాత టీ20 పోరు కోసం సిద్ధమవనున్నాయి ఇరు జట్లు. 28న జరిగే వన్డేతో ఇంగ్లాండ్ పర్యటన పూర్తి కానుంది.

ఇదీ చూడండి : ఇంగ్లాండ్​ సారథి జో రూట్​ మరో రికార్డు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.