ఆస్ట్రేలియా-ఎ జట్టుతో జరుగుతోన్న ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమ్ఇండియా క్రికెటర్ పృథ్వీ షా అద్భుత క్యాచ్ పట్టాడు. ఆసీస్ టెస్టు కెప్టెన్ టిమ్ పైన్‌ను పెవిలియన్ చేర్చడానికి తన సహకారాన్ని అందించాడు.
బ్యాటింగ్‌లో అంతగా రాణించకపోయినా.. ఫీల్డింగ్‌లో పృథ్వీ తనదైన మార్క్ చూపిస్తున్నాడు. ఉమేశ్ యాదవ్ వేసిన షార్ట్ బంతిని ఎదుర్కొన్న టిమ్ పైన్ (44) పుల్‌షాట్ ఆడబోయి స్క్వేర్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న పృథ్వీషాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో పైన్, గ్రీన్ మధ్య సెంచరీ భాగస్వామ్యానికి బ్రేక్ పడింది.
-
Good catch by Shaw!
— cricket.com.au (@cricketcomau) December 7, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Paine's gotta go for 44 after a century stand with Green. Watch #AUSAvIND live: https://t.co/MfBZAvzAkr pic.twitter.com/yvhTgS1IvE
">Good catch by Shaw!
— cricket.com.au (@cricketcomau) December 7, 2020
Paine's gotta go for 44 after a century stand with Green. Watch #AUSAvIND live: https://t.co/MfBZAvzAkr pic.twitter.com/yvhTgS1IvEGood catch by Shaw!
— cricket.com.au (@cricketcomau) December 7, 2020
Paine's gotta go for 44 after a century stand with Green. Watch #AUSAvIND live: https://t.co/MfBZAvzAkr pic.twitter.com/yvhTgS1IvE
ఆస్ట్రేలియా-ఎ జట్టుతో జరుగుతున్న మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌లో భారత్-ఎ జట్టు 9 వికెట్లకు 247 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. కెప్టెన్ రహానె(117) సెంచరీతో అలరించగా.. పుజారా (54) పర్వాలేదనిపించాడు. కాగా, మిగిలిన బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. ఓపెనర్లు పృథ్వీ షా, శుభ్‌మన్ గిల్ ఖాతా తెరవకముందే పెవిలియన్‌కు చేరారు. హనుమ విహారి (15) ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు.
రెండో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా-ఎ జట్టు 286 పరుగులు చేసింది. కామెరూన్ గ్రీన్ (114) శతకంతో అలరించాడు. ప్రస్తుతం భారత్ కంటే ఆస్ట్రేలియా 39 పరుగుల ఆధిక్యంలో ఉంది.
ఇదీ చూడండి: మెరిసిన గ్రీన్.. భారత్‌పై ఆసీస్ పైచేయి