భారత ఓపెనర్ పృథ్వీ షా అద్భుత ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. లిస్ట్ ఏ క్రికెట్లో ద్విశతకం సాధించాడు. ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా పుదుచ్చేరితో జరుగుతోన్న మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో సత్తాచాటాడు. కేవలం 142 బంతుల్లోనే ద్విశతకం బాదిన ఇతడు 227 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇతడి విధ్వంసకర ఇన్నింగ్స్‌తో నిర్ణీత 50 ఓవర్లలో 457 పరుగులు చేసింది ముంబయి.
ఇప్పటికే లిస్ట్-ఎ క్రికెట్లో 6 సెంచరీలు చేశాడు షా. ఈ ఫార్మాట్లో డబుల్ సెంచరీ చేసిన 8వ భారత ఆటగాడిగా నిలిచాడు. అతడి కన్నా ముందు సచిన్ తెందూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, సంజూ శాంసన్, యశస్వీ జైస్వాల్, శిఖర్ ధావన్, కర్ణ్ కౌశల్ ఈ ఘనత సాధించారు.
ఇదీ చూడండి: అంపైరింగ్ సరిగా జరుగుతోందా?.. ఇంగ్లాండ్ ఆరా!