ETV Bharat / sports

'ఈ సిరీస్​ విజయం.. మా అంకుల్​కు అంకితం'

author img

By

Published : Mar 13, 2021, 2:46 PM IST

Updated : Mar 13, 2021, 4:36 PM IST

శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్​ల వన్డే సిరీస్​లో భాగంగా తొలి రెండు మ్యాచ్​లలో విజయం సాధించింది కరీబియన్​ జట్టు. అయితే ఆ సిరీస్ విజయాన్ని విండీస్​ కెప్టెన్ పొలార్డ్​.. తన అంకుల్​కు అంకితమిచ్చాడు. ఆయన ఇటీవలే మరణించారు.

Pollard dedicates ODI series win against SL to late uncle
వన్డే సిరీస్​ను తన మామకు అంకితమిచ్చిన పొలార్డ్

శ్రీలంకపై రెండో వన్డేలో గెలుపును ​తన అంకుల్​ (మామ) స్టీవెన్​​కు అంకితమిచ్చాడు విండీస్​ కెప్టెన్ కీరన్ పొలార్డ్. సొంతగడ్డపై మూడు వన్డేల సిరీస్​లో భాగంగా తొలి రెండు మ్యాచ్​లను కరీబియన్ జట్టు గెలుచుకుంది. దీంతో సిరీస్​నూ కైవసం చేసుకుంది పొలార్డ్​ సేన.

"ఓ క్రికెటర్​గా నాకొక క్లిష్టమైన రోజు. నేను క్రికెట్​ ఆడటానికి కారణమైన వ్యక్తి.. అంకుల్​ (మామ) స్టీవెన్​.. ఈ రోజు ఉదయం చనిపోయారు. అతడికి ఈ సిరీస్ విజయాన్ని అంకితమిస్తున్నా."

-కీరన్​ పొలార్డ్​, విండీస్​ కెప్టెన్.

"టీ20ల కంటే వన్డే సిరీస్​లోనే మా ఆటగాళ్లు మంచి ప్రతిభ చూపారు. లూయిస్ అద్భుత శతకానికి తోడుగా.. షై హోప్​ అర్థ సెంచరీతో రాణించాడు. జేసన్ మహమ్మద్​ కూడా మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు. నికోలస్​ పూరన్​ మ్యాచ్​ను ముగించాడు. మూడో వన్డే కూడా గెలిచి సిరీస్​లో 3-0తో క్లీన్​ స్వీప్​ చేయాలి. ఏదేమైనా, ఈ విజయాన్ని స్టీవెన్​ (అంకుల్)కు అంకితమిస్తున్నా" అని పొలార్డ్​ పేర్కొన్నాడు.

ఇదీ చదవండి: 2020+5 ఒలింపిక్​ అజెండాను ఆమోదించిన ఐఓసీ

Last Updated : Mar 13, 2021, 4:36 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.