పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు జరుగుతున్నాయి. విపక్ష నేతలతో పాటు కొందరు సినీ ప్రముఖులూ ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ విషయంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ తనయ సనా గంగూలీ ఇన్ స్టా వేదికగా స్పందించింది. ప్రముఖ రచయిత కుశ్వంత్ సింగ్ రాసిన 'ద ఎండ్ ఆఫ్ ఇండియా' నవలలోని సారాంశాన్ని పోస్ట్ చేసింది.
సనా పోస్ట్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇంత చిన్న వయసులో ఎంతో పరిణతితో ఆలోచించిందని కొందరు ప్రశంసించగా.. మరికొందరు విమర్శలు చేశారు.
ఈ అంశం కాస్త వివాదానికి దారితీస్తుండగా.. గంగూలీ స్పందించాడు. తన కుమార్తె చిన్న పిల్లని, ఈ అంశానికి దూరంగా ఉంచండని వివరణ ఇచ్చాడు.
-
Please keep Sana out of all this issues .. this post is not true .. she is too young a girl to know about anything in politics
— Sourav Ganguly (@SGanguly99) December 18, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Please keep Sana out of all this issues .. this post is not true .. she is too young a girl to know about anything in politics
— Sourav Ganguly (@SGanguly99) December 18, 2019Please keep Sana out of all this issues .. this post is not true .. she is too young a girl to know about anything in politics
— Sourav Ganguly (@SGanguly99) December 18, 2019
"ఈ వివాదాల నుంచి సనాను దూరంగా ఉంచండి. ఈ పోస్టు నిజం కాదు. తను చిన్న పిల్ల. రాజకీయాల గురించి ఇప్పుడే తెలుసుకోలేదు" -సౌరభ్ గంగూలీ ట్వీట్.
ఇదీ చదవండి: వాడా వేటుపై అప్పీల్‌కు రష్యా నిర్ణయం