ETV Bharat / sports

పీఎస్​ఎల్​ ప్రారంభానికి ముందు క్రికెటర్​కు కరోనా

పాకిస్థాన్​ సూపర్​లీగ్​ ప్రారంభానికి ముందు బయో బబుల్​లోని ఓ క్రికెటర్​కు కరోనా సోకినట్లు పాక్​ క్రికెట్​ బోర్డు వెల్లడించింది. వైరస్ సోకిన ఆటగాడిని క్వారంటైన్​కు తరలించామని పేర్కొంది. రాబోయే రోజుల్లో చేసే కొవిడ్​ టెస్ట్​ల్లో రెండుసార్లు నెగెటివ్​ వచ్చిన తర్వాతే అతడిని బయో బబుల్​లోకి అనుమతిస్తామని పీసీబీ ఓ ప్రకటనలో తెలిపింది.

Player tests COVID positive ahead of PSL 6
పీఎస్​ఎల్​ ప్రారంభానికి ముందు క్రికెటర్​కు కరోనా
author img

By

Published : Feb 20, 2021, 12:02 PM IST

శనివారం నుంచి ప్రారంభం కానున్న పాకిస్థాన్​ సూపర్​లీగ్​పై కరోనా వైరస్​ ప్రభావం పడింది. టోర్నీలో పాల్గొనాల్సిన ఓ క్రికెటర్​కు కొవిడ్​ సోకినట్లు పాక్​ క్రికెట్​ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. అయితే కరోనా బారిన పడిన ఆటగాడి వివరాలను మాత్రం బహిర్గతం చేయలేదు.

"కొవిడ్​ లక్షణాలు కలిగిన ఓ ఫ్రాంచైజీకి చెందిన ఆటగాడికి క్వారంటైన్​కు తరలించగా.. అతడికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. ఆ క్రికెటర్​ రాబోయే పది రోజుల పాటు నిర్బంధంలో ఉండనున్నాడు. తర్వాత అతడికి చేసిన పరీక్షల్లో రెండు సార్లు నెగటివ్​ వస్తే శిబిరంతో కలిసి ఆడేందుకు అనుమతిస్తాం".

- పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు ప్రకటన

పాకిస్థాన్​ సూపర్​లీగ్​ ప్రారంభానికి ముందు వివిధ ఫ్రాంచైజీల ఆటగాళ్లందర్ని ముూడు రోజుల పాటు నిర్బంధంలో ఉంచనుంది పీసీబీ. ఇందుకోసం ఓ బయోబబుల్​ను ఏర్పాటు చేసింది.

అయితే ఇటీవలే ఓ క్రికెటర్​తో పాటు మరో జట్టు అధికారి క్వారంటైన్ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా వారిని మరో మూడు రోజులు నిర్బంధంలో ఉంచనున్నట్లు తెలిపింది.

ఇదీ చూడండి: జాతీయ జట్టును కాదని ఐపీఎల్​లో ఆడేందుకు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.