ETV Bharat / sports

'న్యూజిలాండ్​లో టీ20 ప్రపంచకప్​ జరపండి'

టీ20 ప్రపంచకప్​ నిర్వహణపై సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. టోర్నీని న్యూజిలాండ్​లో జరపాలని సూచించాడు ఆసీస్​ మాజీ క్రికెటర్ డీన్ జోన్స్.

'న్యూజిలాండ్​లో టీ20 ప్రపంచకప్​ జరపండి'
మాజీ క్రికెటర్ డీన్ జోన్స్
author img

By

Published : Jun 4, 2020, 7:10 AM IST

ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 ప్రపంచకప్​ను న్యూజిలాండ్​లో జరపాలని సలహా ఇచ్చాడు మాజీ క్రికెటర్ డీన్ జోన్స్. కివీస్ ప్రధానమంత్రి జెసిండా అర్డెర్న్​.. భౌతిక దూరం మార్గదర్శకాలను సులభతరం చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో జోన్స్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

  • Jacinda Ardern said NZ could move to alert level 1 next week, which means all social distancing measures and curbs on mass gatherings will be lifted, she said. Maybe play the T20 WC there? #justathought

    — Dean Jones AM (@ProfDeano) June 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

షెడ్యూల్​ ప్రకారం అక్టోబరు 18- నవంబరు 15 మధ్య టీ20 ప్రపంచకప్​ జరగాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా మార్చి నుంచి అన్ని క్రీడలు నిలిచిపోయాయి. ఈ టోర్నీ విషయంలోనూ జూన్ 10లోపు నిర్ణయం తీసుకుంటామని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) వెల్లడించింది. అయితే టీ20 ప్రపంచకప్​ను 2022కు వాయిదా వేశారని, గత కొన్నాళ్ల నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో మ్యాచ్​లు జరిగేది సందేహంగా మారింది.

Play the 2020 T20 World Cup in New Zealand, says Dean Jones
టీ20 ప్రపంచకప్​-2020

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.