సిడ్నీలో గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టు ఆరంభానికి ముందు జాతీయ గీతం ఆలపించిన సమయంలో టీమ్ఇండియా(హైదరాబాద్) పేసర్ మహ్మద్ సిరాజ్ భావోద్వేగానికి గురయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. అయితే తాను కన్నీటి పర్యంతం అవ్వడానికి గల కారణాన్ని మ్యాచ్ ముగిసిన అనంతరం వివరించాడు సిరాజ్. చనిపోయిన తన తండ్రి గుర్తుకురావడం వల్లే తాను ఏడ్చినట్లు తెలిపాడు.
-
✊ #AUSvIND pic.twitter.com/4NK95mVYLN
— cricket.com.au (@cricketcomau) January 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">✊ #AUSvIND pic.twitter.com/4NK95mVYLN
— cricket.com.au (@cricketcomau) January 6, 2021✊ #AUSvIND pic.twitter.com/4NK95mVYLN
— cricket.com.au (@cricketcomau) January 6, 2021
"మా నాన్న గుర్తుకురావడం వల్లే నేను భావోద్వేగానికి గురయ్యా. నేను టెస్టు క్రికెట్ ఆడటం చూడాలని అయన ఎప్పుడూ తపన పడేవారు. ఒకవేళ ఆయన ఉండి ఉంటే తప్పకుండా నా ఆట చూసేవారు. ఈ రోజు నేను టెస్టుల్లో ఆడే సమయానికి ఆయన లేకపోవడం చాలా బాధగా ఉంది"
-సిరాజ్, టీమ్ఇండియా పేసర్
కాగా, ఈ పోరుతో టెస్టు అరంగేట్రం చేసిన ఆసీస్ ఆటగాడు పకోస్కీ(62) అందరీ దృష్టినీ ఆకర్షించాడు. అతడిని దెబ్బతీయడానికి టీమ్ఇండియా షార్ట్ పిచ్ బంతులు వేసేలా ప్రణాళిక రచించిందని తెలిపాడు సిరాజ్.
తొలి టెస్టులో సీనియర్ పేసర్ మహ్మద్ షమీ గాయపడగా అతడి స్థానంలో రెండో టెస్టుకు ఎంపికయ్యాడు సిరాజ్. తాత్కాలిక కెప్టెన్ అజింక్యా రహానె ఆ మ్యాచ్‌కు ముందు సిరాజ్కు టెస్టు క్యాప్ అందజేశాడు. ఈ క్రమంలోనే ఆ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన సిరాజ్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలోనే మూడో టెస్టులోనూ అతడికి అవకాశం లభించింది.
ఇదీ చూడండి : జాతీయ గీతం ఆలపిస్తూ సిరాజ్ కంటతడి