రక్షణ వలయాన్ని దాటుకుని విరాట్ కోహ్లీతో ఫొటో దిగేందుకు మైదానంలోకి వెళ్లాడొక అభిమాని. విశాఖ వేదికగా టీమిండియా-సఫారీ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఈ సంఘటన జరిగింది. మైదానంలోకి వచ్చేసిన ఆ వ్యక్తి.. విరాట్, సహా క్రికెటర్లతో కలిసి సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. అయితే కోహ్లీ అతడికి షేక్ హ్యాండ్ ఇచ్చి పంపేశాడు. మొహాలీ వేదికగా దక్షిణాఫ్రికా-భారత్ మధ్య రెండో టీ20లోనూ ఇలానే ఓ అభిమాని పిచ్‌లోకి వచ్చేశాడు. తర్వాత అతడిని మైదాన సెక్యూరిటీ లాక్కెళ్లడం చర్చనీయాంశమైంది.
![Pitch invader manages to take a selfie from far away with Virat Kohli and Co.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4651562_virat_inruder.jpg)
తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 502 పరుగులు చేసి డిక్లేర్ చేసింది టీమిండియా. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన డికాక్ సేన.. 8 వికెట్లు కోల్పోయి 385 పరుగులు సాధించింది.