ETV Bharat / sports

గులాబి ఆటతో.. గుర్తుండిపోయే రికార్డులు - pink test records in edengardens match

చారిత్రక డేనైట్ టెస్టులో విజయం సాధించిన టీమిండియా వరుసగా నాలుగు ఇన్నింగ్స్​ తేడాతో విజయాలు నమోదు చేసింది. అత్యధిక విజయవంతమైన కెప్టెన్ల జాబితాలో కోహ్లీ 5వ స్థానాన్ని దక్కించుకుని.. అలెన్ బోర్డర్ రికార్డును తిరగరాశాడు.

గులాబి ఆటతో.. గుర్తుండిపోయే రికార్డులు
author img

By

Published : Nov 24, 2019, 3:47 PM IST

డేనైట్ టెస్టులో చారిత్రక విజయం సాధించిన భారత్ అరుదైన రికార్డులు సొంతం చేసుకుంది. వరుసగా ఏడో టెస్టు విజయాన్ని నమోదు చేసింది. ఇన్నింగ్స్​ తేడాతో వరుసగా నాలుగో గెలుపునూ కైవసం చేసుకుంది టీమిండియా.

బోర్డర్ రికార్డు బద్దలు..

అత్యధిక విజయవంతమైన కెప్టెన్ల జాబితాలో విరాట్ 5వ స్థానంలో నిలిచాడు. 33 విజయాలతో అలెన్ బోర్డర్(32) రికార్డును బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో గ్రేమ్ స్మిత్(53) అగ్రస్థానంలో నిలిచాడు.

  1. గ్రేమ్ స్మిత్(దక్షిణాఫ్రికా)- 53 విజయాలు
  2. రికీ పాంటింగ్(ఆస్ట్రేలియా) - 48
  3. క్లైవ్ లాయిడ్(వెస్టిండీస్)​ - 36
  4. విరాట్ కోహ్లీ(భారత్) - 33*
  5. అలెన్ బోర్డర్(ఆస్ట్రేలియా) - 32

బలమైన పేస్ దళం..

భారత టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక బలమైన పేస్ దళం ఉన్న జట్టుగా టీమిండియా నిలిచింది. స్పిన్నర్లు వికెట్లేమీ తీయకుండా టెస్టు విజయం సాధించడం ఇది రెండో సారి మాత్రమే. 2018లో జోహన్స్​బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాపై మ్యాచ్​ ఒకటి కాగా.. ప్రస్తుతం కోల్​కతా వేదికగా జరిగిన డే నైట్ టెస్టు రెండోది. 2017-18లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్​లోనూ టీమిండియా స్పిన్నర్లు వికెట్లేమి తీయలేదు. అయితే ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది. సొంతగడ్డపై ఇలా జరగడం ఇదే మొదటిసారి.

విజయవంతమైన కెప్టెన్​..

వరుసగా 7 టెస్టు సిరీస్​లు గెలిచిన కెప్టెన్​గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. స్టీవ్​ వా(71.92 శాతం), పాంటింగ్(62.33శాతం) తర్వాతి స్థానాన్ని కోహ్లీ(62.26 శాతం) ఆక్రమించాడు.

pink test records in edengardens match
విరాట్ కోహ్లీ

గత నాలుగు టెస్టుల్లో ఇన్నింగ్స్​ తేడాతో విజయాలు..

  1. దక్షిణాఫ్రికాపై ఇన్నింగ్స్​ 137 పరుగుల తేడాతో విజయం
  2. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో ఇన్నింగ్స్​ 202 పరుగుల తేడాతో గెలుపు
  3. బంగ్లాతో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్​ 130 పరుగుల తేడాతో నెగ్గిన టీమిండియా.
  4. ప్రస్తుతం జరిగిన డేనైట్ టెస్టులోనూ ఇన్నింగ్స్​ 46 పరుగుల తేడాతో విజయం.

తొలిసారి డేనైట్ టెస్టు ఆడిన టీమిండియా..బంగ్లాపై అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం చెలాయించింది. మొదటి ఇన్నింగ్స్​లో బంగ్లాదేశ్​ 106 పరుగులకే ఆలౌటైంది. అనంతరం బరిలో దిగిన టీమిండియా 347/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(136; 194 బంతుల్లో, 18 ఫోర్లు).. కెరీర్​లో 27వ సెంచరీ నమోదు చేశాడు. పుజారా(55), రహానే(51) అర్ధశతకాలతో జట్టు విజయంలో తమ వంతు పాత్ర పోషించారు.

ఇదీ చదవండి: పింక్ టెస్టు: ఈడెన్ తోటలో.. 'గులాబి' మనదే

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Hiroshima - 24 November 2019
++DAY SHOTS++
1. Wide of people gathering in Hiroshima Peace Memorial Park ahead of Pope Francis' visit
2. Wide of peace monument, Atomic Bomb Dome seen in background
3. Various of peace monument lit up
4. Dome
++NIGHT SHOTS++
5. Wide of monument and more people arriving
6. Mid of monument, guests lined up
7. Guests seated on stage
8. Wide of crowd, guests on stage, monument and dome in background  
STORYLINE:
People gathered at the Peace Memorial Park in Hiroshima on Sunday ahead of a peace meeting headed by Pope Francis.
Francis arrived by plane in Hiroshima, one of two Japanese cities destroyed by American atomic bombs in 1945.
Earlier in the day, Francis demanded world leaders renounce nuclear weapons and the Cold War-era doctrine of mutual deterrence, saying the arms race decreases security, wastes resources and threatens humanity with catastrophic destruction.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.