ETV Bharat / sports

ఐపీఎల్​కు చైనా స్పాన్సర్​ కొనసాగింపు.. ఒమర్ ఆగ్రహం

ఓవైపు చైనాతో సరిహద్దు వివాదం కొనసాగుతుంటే, మరోవైపు ఆ దేశ స్పాన్సర్లను ఐపీఎల్​లో అనుమతించడంపై మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మండిపడ్డారు.

ఐపీఎల్​కు చైనా స్పాన్సర్​ కొనసాగింపు.. ఒమర్ ఆగ్రహం
ఐపీఎల్ ఒమర్ అబ్దుల్లా
author img

By

Published : Aug 3, 2020, 2:50 PM IST

Updated : Aug 3, 2020, 2:56 PM IST

లద్దాఖ్‌ ఘర్షణల నేపథ్యంలో ప్రజలు చైనా వస్తువులను బహిష్కరిస్తుంటే.. ఐపీఎల్‌కు మాత్రం చైనా స్పాన్సర్‌ను కొనసాగించటంపై జమ్ము కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Omar abdullah
ఒమర్ అబ్దుల్లా

"చైనా వస్తువులను బహిష్కరించాలని ప్రజలకు చెప్తూ.. చైనాకు చెందిన సెల్‌ఫోన్‌ ఉత్పత్తిదారులను ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌గా కొనసాగిస్తున్నారు. చైనాను ఎలా నియంత్రించాలో అని మనం అయోమయంలో ఉంటే... ఆ దేశం మనను అపహాస్యం చేయడంలో ఆశ్చర్యం లేదు" అని ఒమర్ ట్విటర్‌ వేదికగా విమర్శించారు.

  • Chinese cellphone makers will continue as title sponsors of the IPL while people are told to boycott Chinese products. It’s no wonder China is thumbing it’s nose at us when we are so confused about how to handle Chinese money/investment/sponsorship/advertising.

    — Omar Abdullah (@OmarAbdullah) August 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • The sheer suddenness of the move, the unexpected nature of the move, the unpredictability of the move. They don’t know what hit them. Now the Chinese will know.......... what we always suspected that we really can’t manage without their sponsorship & advertising.

ఐపీఎల్‌ ప్రస్తుత సీజన్​ సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 10 వరకు నిర్వహించనున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. ఈ మ్యాచ్‌లు దుబాయ్‌, అబుదాబీ, షార్జాలోని మైదానాల్లో జరగనున్నాయి. అయితే లీగ్ స్పాన్సర్స్‌లో ఏ మార్పూ లేదని, చైనా కంపెనీల స్పాన్సర్‌షిప్‌నే కొనసాగించాలని పాలక మండలి ఆదివారం నిర్ణయించింది.

ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌ వివో ఏడాదికి రూ.440 కోట్లు బీసీసీఐకి చెల్లిస్తోంది. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో, ఇంత తక్కువ సమయంలో మరో కొత్త స్పాన్సర్‌ లభ్యం కావడం ఇంచుమించు అసాధ్యమని బోర్డు అభిప్రాయపడింది.

చైనా స్పాన్సర్లను బీసీసీఐ అంగీకరించటం పట్ల ఒమర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా చైనాలో తయారైన టీవీలను తమ ఇళ్లల్లోంచి బయటకు విసిరేసిన బుద్ధిహీనుల పట్ల తనకు జాలిగా ఉందని ఆయన అన్నారు.

Last Updated : Aug 3, 2020, 2:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.