క్రికెటర్లకు వీడియోకాల్ ద్వారా ఫిట్నెస్ పరీక్షలు చేస్తోంది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు. దేశీయ, అంతర్జాతీయ ఆటగాళ్లతో కలిపి దాదాపు 200 మందికి ఏప్రిల్ 20, 21 తేదీల్లో ఈ టెస్ట్‌ను నిర్వహించనున్నారు. కరోనా వ్యాప్తి కారణంగా మార్చి 15 నుంచి ఆ దేశంలో క్రికెట్‌కు సంబంధించిన కార్యకలాపాలన్నీ ఆపేశారు. గత నెల 23, 24 తేదీల్లోనే ఈ ఫిట్నెస్ పరీక్షలు జరగాల్సి ఉండగా రద్దు చేశారు. ప్రస్తుతం ఆ టెస్ట్‌లను వీడియో కాల్ ద్వారా కొనసాగించాలని బోర్డు నిర్ణయించింది. ఆటగాళ్ల కదలికలపై ఉన్న పరిమితులను దృష్టిలో ఉంచుకుని పరీక్షలను నిర్వహించనున్నామని తెలిపింది.
పాకిస్థాన్ జట్టు కోచ్, ఛీఫ్ సెలెక్టర్ మిస్బా-ఉల్-హక్, ట్రైనర్ యాసిర్ మాలిక్.. ఫిట్నెస్ పరీక్షలకు సిద్ధమవ్వాలని ఆటగాళ్లను గతవారమే సమాచారం అందించారు.
"ఫిట్నెస్ సాధించాలంటే క్రమశిక్షణతో పాటు శ్రమించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆటగాళ్లకు కావాల్సిన ఉపకరణాలు అందుబాటులో లేని కారణంగా.. ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలను కల్పిస్తున్నాం. మేము వంద శాతం సహకారం ఇస్తున్నాం. ఎప్పుడైతే మీరు మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉంటారో అప్పడే ఫిట్నెస్ పరీక్షకు సమాచారమివ్వండి. అన్ని పరీక్షలు మీ ట్రైనర్ పర్యవేక్షణలో వీడియోకాల్ ద్వారా జరుగుతాయి."
-ఆటగాళ్లకు పంపిన సందేశ సారాంశం
పాకిస్థాన్‌లో ఇప్పటివరకు 4,194 కరోనా కేసులు నమోదు కాగా, 60 మంది మాహమ్మారి బారిన పడి మరణించారు.
ఇదీ చూడండి.. నెట్టింట పేస్ నయా ఛాలెంజ్.. జర దేఖో