ETV Bharat / sports

టీమ్​ఇండియా క్రికెటర్ల జీతాల్లో కోత? - బీసీసీఐ తాజా వార్తలు

భారత జట్టులోని క్రికెటర్ల జీతాల్లో త్వరలో కోత విధించే అవకాశముందని కోశాధికారి అరుణ్ ధుమాల్ చెప్పారు. త్వరలో జరిగే సమావేశం అనంతరం ఈ విషయమై నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

BCCI
టీమ్​ఇండియా
author img

By

Published : Aug 21, 2020, 5:35 PM IST

కరోనా సంక్షోభంతో అనేక ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఉద్యోగుల వేతనాల్లో కోతలు విధిస్తున్నాయి ఆయా ప్రభుత్వాలు. బీసీసీఐపైనా తాజాగా దీని ప్రభావం పడింది. మార్చి నుంచి వైరస్ ఎఫెక్స్ ఉన్నా, బోర్డు మాత్రం సిబ్బందిని తొలగించడం, ఆటగాళ్ల జీతాలను తగ్గిండం లాంటివి చేయలేదు. కానీ ఇప్పుడు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని, ఆటగాళ్లకు వేతనాల్లో కోత విధింపుపై బోర్డు త్వరలో సమావేశమయ్యే అవకాశం ఉందని సీనియర్​ అధికారి ఒకరు చెప్పారు.

"మేం ఇప్పటి వరకు జీతాల్లో కోత విధింపుపై చర్చించలేదు. త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి, ఈ ప్రభావం ఎంతమేరకు ఉంటుందో పరిశీలిస్తాం. అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని తుది నిర్ణయం తీసుకుంటాం. ఉద్యోగుల తొలగింపు కూడా ఉండే అవకాశం ఉంది.

బీసీసీఐ అధికారి

"ప్రస్తుతం ఐపీఎల్​ జరుగుతున్నందున దాని గురించి మాట్లాడుకుందాం. ఈ లీగ్​ విజయంపైనే మొత్తం ఆధారపడి ఉంది. గతంలో వివోతో కుదుర్చుకున్న టైటిల్​ స్పాన్సర్​షిప్​ ఒప్పొందంతో పోల్చుకుంటే.. ఈ సారి వచ్చేది తక్కువే. కనిష్ట నష్టంతో ఎలా బయటపడగలమనే కోణంలో ఆలోచిద్దాం" అని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్​ పేర్కొన్నారు.

ఇప్పటికే కరోనా ప్రభావంతో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్​, వెస్టిండీస్​, న్యూజిలాండ్​ క్రికెట్ బోర్డులూ తమ ఆటగాళ్లు, సిబ్బంది జీతాలను తగ్గించాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.