భారత యువ వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్.. మైదానంలో ధోనీ నినాదాలు వినేందుకు అలవాటు పడాలని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ అన్నాడు. వాటిని వింటూనే ఒత్తిడి నుంచి బయటపడే మార్గం వెతకాలని సూచించాడు.
![BCCI President Sourav Ganguly](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5288941_ganguly.jpg)
"ఆ నినాదాలు పంత్‌కు మంచివే. వాటికి అతడు అలవాటు పడాలి. అవి వింటూనే విజయవంతం కావడానికి దారి కనుక్కోవాలి. ఒత్తిడిని ఎదుర్కొంటూనే అతడు క్రికెట్లో తన ముద్ర వేయాలి. ప్రతిసారీ మనకు ఎంఎస్ ధోనీ అందుబాటులో ఉండడు. మహీ సాధించింది పంత్ సాధించాలంటే 15 ఏళ్లు పడుతుంది. భారత్‌కు అతడు చేసిన సేవలకు బీసీసీఐ కేవలం ధన్యవాదాలు చెబితే సరిపోదు. అతడి వీడ్కోలు సంగతి పక్కన పెట్టండి. మేం విరాట్, సెలక్టర్లతో మాట్లాడుతున్నాం. సమయం వచ్చినప్పుడు వివరాలు చెప్తాం" - సౌరభ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు
ఐపీఎల్లో మెరుపులు మెరిపించే పంత్.. అంతర్జాతీయ మ్యాచుల్లో ఒత్తిడికి గురవుతున్నాడు. ఫామ్ కోల్పోయాడు. కీపింగ్‌లో ప్రాథమిక అంశాల్లోనూ పొరపాట్లు చేస్తున్నాడు. ఈ విషయమై అతడిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరూ కావాలని పొరపాట్లు చేయరని, పంత్‌ను ఏకాకిని చేయొద్దని టీమిండియా సారథి కోహ్లీ, వైస్‌కెప్టెన్ రోహిత్.. ఇంతకు ముందే అతడికి అండగా నిలిచారు.
![Young wicketkeeper-batsman Rishabh Pant](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5288941_rishab-pant.jpg)
ఇది చదవండి: భారత తొలి సెంచరీ వీరుడు.. వెండితెరపైకి వస్తున్నాడు..!