యువ క్రీడాకారులకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని భావిస్తోన్న టీమిండియా సెలక్షన్ కమిటీ అందుకు తగ్గట్టుగానే ప్రణాళికలు రచిస్తోంది. స్వదేశంలో ఆగస్టు 29న ప్రారంభంకానున్న దక్షిణాఫ్రికా-ఏ సిరీస్ కోసం రెండు భారత-ఏ జట్లను ప్రకటించింది.
ఈ సిరీస్‌లో మొత్తం ఐదు వన్డేలు జరగనుండా.. మూడు వన్డేలకు మనీష్ పాండే, రెండు మ్యాచ్‌లకు శ్రేయస్ అయ్యర్ సారథులుగా వ్యవహరించనున్నారు. పాండే జట్టుకు ఇషాన్ కీపర్ కాగా.. శ్రేయస్ టీమ్‌లో సంజు శాంసన్ ఆ బాధ్యతల్ని చూసుకోనున్నాడు.
యువ ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, విజయ్ శంకర్, అన్‌మోల్ ప్రీత్, రికీ భుయ్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, నితీశ్ రాణా, శివం దూబే రెండు జట్లలోనూ ఆడనున్నారు. తొలి మూడు మ్యాచ్‌లకు చాహల్ అందుబాటులో ఉంటాడు. ఆగస్టు 29, 31, సెప్టెంబర్ 2, 4, 8 తేదీల్లో వన్డేలు జరగనున్నాయి.
పాండే జట్టు
మనీష్ పాండే (సారథి), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, అన్‌మోల్ ప్రీత్ సింగ్, రికీ భుయ్, ఇషాన్ కిషన్ (కీపర్), విజయ్ శంకర్, శివం దూబే, కృనాల్ పాండ్య, అక్షర్ పటేల్, చాహల్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, ఖలీల్ అహ్మద్, నితీష్ రాణా
శ్రేయస్ జట్టు
శ్రేయస్ అయ్యర్ (సారథి), శుభ్‌మన్ గిల్, ప్రశాంత్ చోప్రా, అన్‌మోల్ ప్రీత్ సింగ్, రికి భుయ్, సంజు శాంసన్ (కీపర్), నితీష్ రాణా, విజయ్ శంకర్, శివం దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రాహుల్ చాహర్, శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్‌పాండే, ఇషాన్ పోరెల్
ఇవీ చూడండి.. విండీస్‌తో టెస్టులకు నెట్ బౌలర్‌గా సైని