కరాచీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్థాన్ ఆటగాళ్లు అరుదైన రికార్డు నమోదు చేశారు. ఫలితంగా సుదీర్ఘ ఫార్మాట్లో టాప్-4 బ్యాట్స్మెన్లు శతకాలు చేసిన రెండో జట్టుగా ఘనత సాధించింది పాక్. 2007లో బంగ్లాదేశ్‌పై భారత ఆటగాళ్లు వసీం జాఫర్, దినేశ్ కార్తీక్, రాహుల్ ద్రవిడ్, సచిన్ తెందూల్కర్ శతకాలతో రికార్డు సృష్టించారు.
లంకతో రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో.. మూడు వికెట్లు మాత్రమే నష్టపోయి 555 పరుగులు చేసింది పాకిస్థాన్. ఇందులో బాబర్ అజామ్(100*), అబిద్ అలీ(174), అజహర్ అలీ(118), షాన్ మసూద్(135) సెంచరీలు సాధించారు.
-
The Awesome Foursome:@AbidAli_Real ✔@shani_official ✔@AzharAli_ ✔@babarazam258 ✔
— Pakistan Cricket (@TheRealPCB) December 22, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Only the second instance in Test history of the top-four batsmen scoring 100s in the same innings. First time for Pakistan. #PAKvSL LIVE: https://t.co/jFigEwJ4Bs pic.twitter.com/ODZdJY0Tcj
">The Awesome Foursome:@AbidAli_Real ✔@shani_official ✔@AzharAli_ ✔@babarazam258 ✔
— Pakistan Cricket (@TheRealPCB) December 22, 2019
Only the second instance in Test history of the top-four batsmen scoring 100s in the same innings. First time for Pakistan. #PAKvSL LIVE: https://t.co/jFigEwJ4Bs pic.twitter.com/ODZdJY0TcjThe Awesome Foursome:@AbidAli_Real ✔@shani_official ✔@AzharAli_ ✔@babarazam258 ✔
— Pakistan Cricket (@TheRealPCB) December 22, 2019
Only the second instance in Test history of the top-four batsmen scoring 100s in the same innings. First time for Pakistan. #PAKvSL LIVE: https://t.co/jFigEwJ4Bs pic.twitter.com/ODZdJY0Tcj
అలీ రికార్డు...
తొలి రెండు టెస్టుల్లోనూ సెంచరీలు చేసిన తొలి పాకిస్థాన్ క్రికెటర్‌గా అబిద్ అలీ రికార్డు నెలకొల్పాడు. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొమ్మిదో బ్యాట్స్‌మన్‌గా పేరుతెచ్చుకున్నాడు. అరంగేట్ర వన్డే, టెస్టుల్లో సెంచరీ చేసిన ఏకైక పాక్ ఆటగాడిగా నిలిచాడు.