ETV Bharat / sports

'పాకిస్థాన్​ ఆటగాళ్లకు భారత్​ ఎప్పుడూ సురక్షితమే' - క్రికెట్​ న్యూస్​

పాకిస్థాన్ జట్టు వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్​ కోసం భారత్​కు వస్తే భద్రత పెద్ద సమస్య కాదని టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ ఆకాశ్​ చోప్రా తెలిపాడు. భారత్​లో పర్యటన కోసం బీసీసీఐ నుంచి లిఖిత పూర్వక హామీ ఇప్పించాలని ఇటీవలే పాక్​ క్రికెట్​ బోర్డు ఐసీసీని కోరిన నేపథ్యంలో చోప్రా ఈ వ్యాఖ్యలు చేశాడు.

Pakistan team will be safe in India when they come for 2021 T20 World Cup: Aakash Chopra
'పాకిస్థాన్​ ఆటగాళ్లకు భారత్​ ఎప్పుడూ సురక్షితమే'
author img

By

Published : Jun 30, 2020, 5:16 PM IST

Updated : Jun 30, 2020, 8:34 PM IST

భారత్‌లో నిర్వహించే 2021 టీ20, 2023 వన్డే ప్రపంచకప్‌లలో పాకిస్థాన్‌ ఆటగాళ్లు వీసా పొందే సమయంలో ఎటువంటి సమస్యలు ఎదుర్కోకుండా.. బీసీసీఐ లిఖితపూర్వక హామీ ఇవ్వాలని పాక్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) ఐసీసీని కోరింది. పాకిస్థాన్ అథ్లెట్లు భారత్​లో ఆడేందుకు వీసాలు నిరాకరించిన సందర్భాలు గతంలో చాలానే ఉన్నాయి. ఈ క్రమంలోనే వీసాతో పాటు, ఆటగాళ్ల భద్రతపరంగా పీసీబీ లిఖిత పూర్వక హామీ కోరుతోంది. అయితే, ఈ విషయంపై భారత మాజీ క్రికెటర్​ ఆకాశ్​ చోప్రా స్పందించాడు. వచ్చే ఏడాది భారత్​లో జరిగే టీ20 ప్రపంచకప్​నకు క్లియరెన్స్​ లభిస్తే.. పాకిస్థాన్​ ఆటగాళ్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు.

"పాకిస్థాన్​ టీ20 ప్రపంచకప్​ కోసం భారత్​కు ఎప్పుడొచ్చినా భద్రత పెద్ద సమస్య కాదు. ఆ విషయంలో మేము హామీ ఇస్తాం. బీసీసీఐ కూడా దీనిపై స్పందించడం లేదు. కరోనా కారణంగా భవిష్యత్తులో ఏం జరగనుందో ఎవరికీ తెలియదు. కాబట్టి బీసీసీఐ ప్రస్తుత పరిస్థితుల్లో దీని గూరించి మాట్లాడటం లేదు. మొదట టీ20 ప్రపంచ కప్​ నిర్వహణపై కొంత స్పష్టత రానివ్వండి. ఆ తర్వాత భద్రతపరమైన సమస్యలను పరిష్కరించొచ్చు."

-ఆకాశ్​ టోప్రా, భారత మాజీ క్రికెటర్​

ఈ మెగాటోర్నీ​ జరగడానికి చాలా సమయం ఉందని.. పాకిస్థాన్ జట్టు భారత్​కు ఎప్పుడొచ్చినా భద్రతపరంగా భరోసా కల్పిస్తామని చోప్రా స్పష్టం చేశాడు.

భారత్​- పాకిస్థాన్​ దేశాల మధ్య దశాబ్దాలుగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇటీవల కాలంలో మరింత తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. 2019లో పుల్వామా ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్​తో.. భారత్​ అన్ని క్రీడా సంబంధాలను తెంచుకుంది. పాక్ చివరగా 2013లో రెండు టీ20, మూడు వన్డేల సిరీస్​ కోసం భారత్​లో పర్యటించింది.

ఇదీ చూడండి:ఆరుగురు పాకిస్థాన్​ క్రికెటర్లకు కరోనా నెగిటివ్​

Last Updated : Jun 30, 2020, 8:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.