ETV Bharat / sports

టీమ్​ఇండియాపై పాకిస్థాన్​ ప్రధాని ప్రశంసలు - టీమ్​ఇండియాపై పాకిస్థాన్​ ప్రధాని ప్రశంసలు

టీమ్​ఇండియాపై పాకిస్థాన్​ ప్రధానమంత్రి ఇమ్రాన్​ ఖాన్​ ప్రశంసలు కురిపించారు. ప్రస్తుత పరిస్థితిలో భారత జట్టు మేటిగా ఎదుగుతోందని ఆయన కొనియాడారు.

Pakistan PM Imran Khan gives thumbs up to 'top team' India
టీమ్​ఇండియాపై పాకిస్థాన్​ ప్రధాని ప్రశంసలు
author img

By

Published : Feb 16, 2021, 2:10 PM IST

పాకిస్థాన్‌ ప్రధాని, మాజీ సారథి ఇమ్రాన్‌ఖాన్‌ భారత క్రికెట్‌ జట్టును కొనియాడారు. ప్రపంచంలో మేటి జట్టుగా టీమ్‌ఇండియా ఎదుగుతోందని కితాబిచ్చారు. ఇటీవలే ఆయన మీడియాతో మాట్లాడుతూ టీమ్​ఇండియా గురించి ప్రస్తావించారు.

"ఇప్పుడున్న పరిస్థితుల్లో టీమ్‌ఇండియాను చూడండి. ప్రపంచంలోనే మేటి జట్టుగా ఎదుగుతోంది. ఎందుకంటే.. వాళ్లు సరైన ప్రణాళికను రూపొందించుకొని ముందుకు సాగుతున్నారు".

- ఇమ్రాన్ ఖాన్​, పాకిస్థాన్​ ప్రధానమంత్రి

అలాగే తమ దేశంలోనూ మంచి నైపుణ్యం ఉన్న ఆటగాళ్లు ఉన్నారని పాక్‌ ప్రధాని పేర్కొన్నారు. కానీ, అలా మంచి ప్రణాళికతో ముందుకెళ్లడానికి, అత్యుత్తమ ఆటగాళ్లను తీర్చిదిద్దడానికి సమయం పడుతుందని చెప్పారు. ఏదో ఒక రోజు పాకిస్థాన్‌ కూడా ప్రపంచ క్రికెట్‌లో టాప్‌లో నిలుస్తుందన్న నమ్మకం ఉందన్నారు. ఇటీవలే తమ క్రికెట్‌ ప్రణాళికలు మారినందున మెల్లిగా పాకిస్థాన్‌ మెరుగవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఈ మధ్య తనకు క్రికెట్‌ చూడటానికి కూడా సమయం దొరకడం లేదని ఇమ్రాన్‌ అన్నారు.

ఇమ్రాన్‌ఖాన్‌ పాకిస్థాన్‌ క్రికెట్‌లో 21 ఏళ్ల పాటు సేవలు అందించారు. 1971లో ఇంగ్లాండ్‌పై అరంగేట్రం చేసి 1992లో అదే జట్టుపై చివరి వన్డే ఆడారు. ఈ క్రమంలోనే ఆ కాలంలో అత్యుత్తమ ఆటగాడిగా ప్రత్యేక గుర్తింపు సాధించారు. అలాగే తన సారథ్యంలోనే ఆస్ట్రేలియాలో జరిగిన 1992 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ను తొలిసారి విశ్వవిజేతగా నిలిపారు.

ఇదీ చూడండి: విజయం దిశగా భారత్​.. లంచ్​ విరామానికి ఇంగ్లాండ్​ 116/7

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.