టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై పాకిస్థాన్ పేసర్ మహమ్మద్ ఇర్ఫాన్ ప్రశంసలు కురిపించాడు. ప్రపంచంలోనే అతడు అత్యుత్తమ బ్యాట్స్మన్ అని చెప్పాడు. ఇటీవలే ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాలు తెలిపాడు.
2012లో జరిగిన వన్డే సిరీస్లో పాక్పై 2-1 తేడాతో భారత్ గెలుపొందింది. అయితే, బలహీన బౌలర్లపై దాడి చేయగల కోహ్లీ సామర్థ్యమే.. అతడ్ని విజయం వైపు నిలిచేలా చేసిందని ఇర్ఫాన్ అన్నాడు.
![Pakistan pacer Mohammad Irfan terms India batsman as the 'best at the moment' in the world](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8426501_28_8426501_1597465243176.png)
"కోహ్లీలో ఆడే విధానం చాలా భిన్నమైనది. ప్రతి బంతిని, బౌలర్లను అంచనా వేసుకుని ఆడటం అతడి ప్రత్యేకత. బలమైన బౌలింగ్ దాడిలో 5,6 పరుగులు చేసి.. బలహీనమైన బౌలర్లపై మాత్రం విరుచుకుపడతాడు"
మహమ్మద్ ఇర్ఫాన్, పాకిస్థాన్ పేసర్
కరోనా ప్రభావంతో కోహ్లీ కూడా కొంతకాలం నుంచి ఆటకు దూరంగా ఉన్నాడు. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి జరగబోయే ఐపీఎల్ కోసం సిద్ధమవుతున్నాడు. ఈ లీగ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు నాయకత్వం వహిస్తున్నాడు.
![Pakistan pacer Mohammad Irfan terms India batsman as the 'best at the moment' in the world](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/virat-kohli_0208newsroom_1596367059_739.jpg)