ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్‌పై వీలు చిక్కినప్పుడల్లా అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది పాకిస్థాన్. తాజాగా పాక్‌లో ఆడేందుకు పది మంది శ్రీలంక ఆటగాళ్లు అభ్యంతరం చెప్పగా.. ఇందుకు కారణం భారత్ అని విమర్శించారు ఆ దేశ మంత్రి ఫవాద్ హుస్సేన్ చౌదరి. తమ దేశంలో లంక ఆటగాళ్లు ఆడితే ఐపీఎల్ కాంట్రాక్టులను రద్దు చేస్తామని భారత్ బెదిరించినట్లు ట్వీట్ చేశారు.
"పాక్‌లో ఆడకూడదని శ్రీలంక ఆటగాళ్లను భారత్ బెదిరించినట్లు కొంత మంది వ్యాఖ్యాతలు నాకు చెప్పారు. ఒకవేళ ఆడితే వారి ఐపీఎల్ కాంట్రాక్టులను రద్దు చేస్తామని భయపెట్టారని తెలిసింది. ఇది నిజంగా చవకబారుతనం. పక్షపాత బుద్ధితో భారత క్రీడావర్గాలు దారుణంగా ప్రవర్తించాయి"
-ఫవాద్ హుస్సేన్ చౌదరి, పాక్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి.
-
Informed sports commentators told me that India threatened SL players that they ll be ousted from IPL if they don’t refuse Pak visit, this is really cheap tactic, jingoism from sports to space is something we must condemn, really cheap on the part of Indian sports authorities
— Ch Fawad Hussain (@fawadchaudhry) September 10, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Informed sports commentators told me that India threatened SL players that they ll be ousted from IPL if they don’t refuse Pak visit, this is really cheap tactic, jingoism from sports to space is something we must condemn, really cheap on the part of Indian sports authorities
— Ch Fawad Hussain (@fawadchaudhry) September 10, 2019Informed sports commentators told me that India threatened SL players that they ll be ousted from IPL if they don’t refuse Pak visit, this is really cheap tactic, jingoism from sports to space is something we must condemn, really cheap on the part of Indian sports authorities
— Ch Fawad Hussain (@fawadchaudhry) September 10, 2019
పాకిస్థాన్‌లో పర్యటించాలని నిర్ణయించుకున్న శ్రీలంకకు ఆ దేశ ఆటగాళ్లు షాకిచ్చారు. టీ-20 కెప్టెన్ మలింగ, మాజీ సారథి ఏంజెలో మ్యాథ్యూస్ సహా పది మంది ఆటగాళ్లు దాయాది దేశంలో ఆడకూడదని నిర్ణయించుకున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ నెల 27 నుంచి ఇరు జట్ల మధ్య మూడు టీ-20లు, మూడు వన్డేలు జరగాల్సి ఉంది.
ఇదీ చదవండి: పాకిస్థాన్‌లో ఆడేందుకు శ్రీలంక క్రికెటర్ల విముఖత