ETV Bharat / sports

సెహ్వాగ్​ను చూసి సచిన్ అనుకున్నా: లతీఫ్ - సెహ్వాగ్ తాజా వార్తలు

ఓ సందర్భంలో సెహ్వాగ్​ను చూసి సచిన్​ అనుకున్నానని తెలిపాడు పాకిస్థాన్ మాజీ సారథి రషీద్ లతీఫ్. ఓ యూట్యూబ్​ ఛానెల్​లో మాట్లాడిన లతీఫ్​ ఈ విషయాన్ని వెల్లడించాడు.

సెహ్వాగ్
సెహ్వాగ్
author img

By

Published : May 13, 2020, 10:28 AM IST

టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌, విధ్వంసక బ్యాట్స్‌మన్‌ వీరేందర్ సెహ్వాగ్‌ను చూసి ఓ సందర్భంలో క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ అనుకున్నానని పాకిస్థాన్‌ మాజీ సారథి రషీద్‌ లతీఫ్‌ అన్నాడు. ఇటీవల ఓ యూట్యూబ్‌ ఛానెల్‌లో మాట్లాడిన లతీఫ్‌ ఈ విషయాన్ని వెల్లడించాడు. శ్రీలంక, టీమ్‌ఇండియా మధ్య జరిగిన ఓ మ్యాచ్‌లో సెహ్వాగ్‌ను చూసి సచిన్‌లా భ్రమపడినట్లు చెప్పాడు.

"భారత్‌-శ్రీలంక ఆడుతున్న ఓ మ్యాచ్‌ను నేను టీవీలో వీక్షిస్తున్నా. ఆ మ్యాచ్‌లో సచిన్‌ లేడు. అప్పుడు సెహ్వాగ్‌ బ్యాటింగ్‌ చేస్తున్నాడు. అతడిని చూసి 'ఎవరీ ఆటగాడు? అచ్చం లిటిల్‌మాస్టర్‌లా ఆడుతున్నాడు' అని అనుకున్నా. సచిన్‌ లాగే ప్యాడ్లు, హెల్మెట్‌ ధరించాడు. ఇంకా చెప్పాలంటే సచిన్‌ కంటే బాగా ఆడుతున్నాడు" అని లతీఫ్‌ నాటి సంగతుల్ని గుర్తుచేసుకున్నాడు.

"సెహ్వాగ్‌ మ్యాచ్‌ విన్నర్‌. ప్రత్యర్థి బౌలర్లపై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించేలా ఆడతాడు. మాలాంటి ఓపెనర్లు మొదట్లో పిచ్‌లు, ప్రత్యర్థి బౌలర్లను చూసి భయపడేవాళ్లం. కానీ సెహ్వాగ్‌ అలా కాదు. బౌలర్‌ ఎవరైనా అదరడు, బెదరడు. మెక్‌గ్రాత్‌, బ్రెట్‌లీ, వసీమ్‌ అక్రమ్‌, షోయబ్‌ అక్తర్‌.. వీళ్లెవరికీ భయపడేవాడు కాదు. అతనో ప్రభావవంతమైన ఆటగాడు. టీమ్‌ఇండియాలోనూ మంచి ఆదరణ సంపాదించుకున్నాడు. అతని లాంటి క్రికెటర్లు ప్రపంచ క్రికెట్‌లో రాణిస్తారు."

-లతీఫ్‌, పాకిస్థాన్ మాజీ సారథి

డాషింగ్‌ ఓపెనర్‌కు ఆటమీద కచ్చితమైన నియంత్రణ ఉండేదని, అతని టెక్నిక్‌ కూడా అమోఘమని చెప్పాడు లతీఫ్. అయితే, సెహ్వాగ్‌ ఫుట్‌వర్క్‌ పరిమితంగా ఉంటుందని, చాలా మంది దాన్ని విమర్శిస్తారని గుర్తుచేశాడు. కానీ, అదే అతనిని విజయవంతమైన క్రికెటర్‌గా తీర్చిదిద్దిందని వివరించాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.