ETV Bharat / sports

ఇంగ్లాండ్​ చేరిన పాక్​ క్రికెటర్లకు కరోనా నెగటివ్​ - పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు న్యూస్

ద్వైపాక్షిక సిరీస్​ కోసం తమ దేశానికి చేరుకున్న పాకిస్థాన్​ జట్టుకు, ఇంగ్లాండ్​ క్రికెట్​ బోర్డు కరోనా పరీక్షలు నిర్వహించింది. ఇందులో భాగంగా పాక్​ బృందం మొత్తానికి నెగటివ్​ వచ్చినట్లు వెల్లడించింది.

Pakistan cricket squad in UK test negative for coronavirus, says ECB
ఇంగ్లాండ్​ చేరిన పాకిస్థాన్​ క్రికెటర్లకు కరోనా నెగటివ్​
author img

By

Published : Jul 1, 2020, 12:48 PM IST

Updated : Jul 1, 2020, 1:17 PM IST

ఇంగ్లీష్ గడ్డపై పర్యటనకు వెళ్లిన పాకిస్థాన్​ క్రికెట్​ బృందానికి, కరోనా నెగటివ్​గా తేలిందని ఇంగ్లాండ్​ క్రికెట్​ బోర్డు తెలిపింది. ఇటీవలే తమ దేశానికి చేరుకున్న పాక్ జట్టు సభ్యులకు (20 మంది ఆటగాళ్లు + 11 మంది సహాయక సిబ్బంది) ఈ పరీక్షలు చేసినట్లు తెలిపింది.

మూడుసార్లు పరీక్షలు

తమ క్రికెటర్లకు, సోమవారం చివరిసారి కొవిడ్​ పరీక్షలు చేయించామని ఇంగ్లాండ్​ క్రికెట్​ బోర్డు స్పష్టం చేసింది. ఆటగాళ్లతో పాటు సహాయక సిబ్బందికి ఇప్పటికే మూడుసార్లు కరోనా టెస్ట్​లు నిర్వహించామని ఈసీబీ తెలిపింది.

Pakistan cricket squad in UK test negative for coronavirus, says ECB
పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు

ఆ నలుగురు స్వదేశంలోనే!

కరోనా బారిన పడిన పదిమంది పాకిస్థాన్ ఆటగాళ్లకు తాజాగా చేసిన పరీక్షల్లో ఆరుగురికి నెగటివ్​ వచ్చిందని పాక్ క్రికెట్​ బోర్డు ప్రకటించింది. కోలుకున్న వారిని తిరిగి ఇంగ్లాండ్​ పర్యటనకు పంపిస్తామని తెలిపింది. మిగిలిన నలుగురు ఆటగాళ్లు(ఇమ్రాన్​ ఖాన్​, కాశీఫ్​ బట్టీ, హైదర్​ అలీ, హరీస్​ రఫ్​) స్వదేశంలోనే ఉంటారని స్పష్టం చేసింది.

క్వారంటైన్​ ప్రారంభం

ఇంగ్లాండ్​, పాకిస్థాన్​ల మధ్య ఆగస్టులో మూడు టెస్టులు, మూడు వన్డేలు జరగనున్నాయి. అయితే ఈ మ్యాచ్​ల షెడ్యూల్​ను ఇంకా విడుదల​ చేయలేదు. పాకిస్థాన్​ క్రికెట్​ బృందం, గత ఆదివారం యునైటెడ్​ కింగ్​డమ్​కు​ చేరిన తర్వాత 14 రోజుల క్వారంటైన్​లో ఉంటున్నట్లు పాక్​ తెలిపింది. ​ ​

ఇదీ చూడండి... ఆరుగురు పాకిస్థాన్​ క్రికెటర్లకు కరోనా నెగిటివ్​

Last Updated : Jul 1, 2020, 1:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.