పాకిస్థాన్ యువ క్రికెటర్ అబిద్ అలీ.. ప్రపంచ క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. అరంగేట్రంలోనే టెస్టు, వన్డే ఫార్మాట్లలో సెంచరీలు చేసిన తొలి పురుష క్రికెటర్గా రికార్డులకెక్కాడు. శ్రీలంకతో రావల్పిండి వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో శతకం బాదడం ద్వారా ఇది సాధ్యమైంది.
ఈ ఏడాది మార్చిలో దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియాతో తొలి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ ఆడాడు అలీ. ఇందులో 112 పరుగులు చేశాడు. తాజాగా శ్రీలంకతో జరిగిన టెస్టులో 183 బంతుల్లో 100 పరుగులు(11 ఫోర్లు) సాధించాడు. ఈ రెండు సెంచరీలు ఒకే ఏడాది చేయడం విశేషం.
-
💯 on ODI debut ✅
— Pakistan Cricket (@TheRealPCB) December 15, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
💯 on Test debut ✅
Well done @AbidAli_Real 👏👏👏#PAKvSL pic.twitter.com/aTblVb7wZa
">💯 on ODI debut ✅
— Pakistan Cricket (@TheRealPCB) December 15, 2019
💯 on Test debut ✅
Well done @AbidAli_Real 👏👏👏#PAKvSL pic.twitter.com/aTblVb7wZa💯 on ODI debut ✅
— Pakistan Cricket (@TheRealPCB) December 15, 2019
💯 on Test debut ✅
Well done @AbidAli_Real 👏👏👏#PAKvSL pic.twitter.com/aTblVb7wZa
ఈ శతకంతో దాయాది దేశం దిగ్గజాల సరసన చేరాడు అబిద్. అరంగేట్రంలోనే సుదీర్ఘ ఫార్మాట్లో సెంచరీ చేసిన 13వ పాకిస్థాన్ క్రికెటర్గా పేరు తెచ్చుకున్నాడు. గతంలో ఇలాగే సెంచరీలు చేసిన జావేద్ మియాందాద్, మహ్మద్ వసీం, యూనిస్ ఖాన్, అలీ నవ్వీ సరసన నిలిచాడు.
-
Hundred on Test debut for Pakistan!
— Pakistan Cricket (@TheRealPCB) December 15, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Khalid Ibadulla 166
Javed Miandad 163
Saleem Malik 100*
Mohammad Wasim 109*
Ali Naqvi 115
Azhar Mahmood 128*
Younis Khan 107
Taufeeq Umar 104
Yasir Hameed 170
Yasir Hameed 105
Fawad Alam 168
Umar Akmal 129
ABID ALI 1⃣0⃣6⃣*#PAKvSL pic.twitter.com/Bstoa2k7O5
">Hundred on Test debut for Pakistan!
— Pakistan Cricket (@TheRealPCB) December 15, 2019
Khalid Ibadulla 166
Javed Miandad 163
Saleem Malik 100*
Mohammad Wasim 109*
Ali Naqvi 115
Azhar Mahmood 128*
Younis Khan 107
Taufeeq Umar 104
Yasir Hameed 170
Yasir Hameed 105
Fawad Alam 168
Umar Akmal 129
ABID ALI 1⃣0⃣6⃣*#PAKvSL pic.twitter.com/Bstoa2k7O5Hundred on Test debut for Pakistan!
— Pakistan Cricket (@TheRealPCB) December 15, 2019
Khalid Ibadulla 166
Javed Miandad 163
Saleem Malik 100*
Mohammad Wasim 109*
Ali Naqvi 115
Azhar Mahmood 128*
Younis Khan 107
Taufeeq Umar 104
Yasir Hameed 170
Yasir Hameed 105
Fawad Alam 168
Umar Akmal 129
ABID ALI 1⃣0⃣6⃣*#PAKvSL pic.twitter.com/Bstoa2k7O5
గతంలో ఓ మహిళా క్రికెటర్...
ఇంగ్లాండ్కు చెందిన క్రికెటర్ ఇనిద్ బేక్వెల్ గతంలో ఇదే తరహా రికార్డు నెలకొల్పింది. 1968లో తొలి టెస్టు సెంచరీని నమోదు చేయగా.. 1973లో ఆడిన తొలి వన్డేలోనే శతకాన్ని సాధించింది. ఫలితంగా వన్డే, టెస్టు అరంగేట్రంలోనే సెంచరీ చేసిన తొలి క్రికెటర్గా రికార్డులకెక్కింది.
దశాబ్దం తర్వాత పాక్లో టెస్టు...
దశాబ్దం తర్వాత పాకిస్థాన్‌లో అంతర్జాతీయ టెస్టు క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. 2009లో శ్రీలంకపై ఉగ్రదాడి తర్వాత తొలిసారి మళ్లీ అదే జట్టు టెస్టు మ్యాచ్‌లకు అంగీకరించింది. ఏ జట్టుతో ఆడేటప్పుడు ఆఖరిగా స్వదేశంలో క్రికెట్ నిలిచిపోయిందో అదే లంకతో మళ్లీ సుదీర్ఘ ఫార్మాట్లో పాక్ తలపడబోతుండడం విశేషం.