షోయబ్ మాలిక్ - సానియా మిర్జా వివాహం మరువకముందే మరో పాకిస్థానీ క్రికెటర్ హసన్ అలీ భారత్కు చెందిన షామియా అర్జును పెళ్లి చేసుకున్నాడు. మంగళవారం దుబాయ్లో వీరిద్దరూ ఒక్కటయ్యారు. నెల రోజుల నుంచి హసన్ అలీ పెళ్లి విషయంపై వార్తలు వస్తున్నాయి.
"మంగళవారం దుబాయ్లో ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా మా నిఖా జరిగింది. మా ఇద్దరికి అత్యంత సన్నిహితులు, మిత్రులు ఈ వివాహానికి హజరయ్యారు" - హసన్ అలీ, పాకిస్థాన్ బౌలర్
హరియాణా మేవాట్కు చెందిన షామియా అర్జును దుబాయ్లో కలిసిన హసన్ అలీ.. ఆమె ముందు తన ప్రేమను వ్యక్తపరిచాడు. అత్యంత సన్నిహితుల మధ్య ఈ వివాహ వేడుక జరిగింది. బుధవారం పెళ్లి రిసెప్షన్ జరగనుంది. వివాహానికి ముందు వీరు దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి.
ఇది చదవండి: 'నో టైమ్ టు డై' అంటున్న బాండ్