ETV Bharat / sports

కెప్టెన్​గా పైన్‌కు రోజులు దగ్గర పడ్డాయి: గావస్కర్‌ - పైన్ వార్తలు

సిడ్నీ టెస్టులో టీమ్ఇండియా బ్యాట్స్​మెన్​ను స్లెడ్జింగ్ చేస్తూ కనిపించాడు ఆస్ట్రేలియా సారథి టిమ్ పైన్. ఈ విషయంపై మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ మండిపడ్డాడు. పైన్ ప్రవర్తన నాయకుడి స్థాయికి తగ్గట్లుగా లేదని విమర్శించాడు.

Gavaskar
గావస్కర్‌
author img

By

Published : Jan 12, 2021, 10:16 AM IST

Updated : Jan 12, 2021, 11:44 AM IST

రవిచంద్రన్‌ అశ్విన్‌ను స్లెడ్జింగ్‌తో ఇబ్బంది పెట్టిన ఆస్ట్రేలియా కెప్టెన్‌ టిమ్‌ పైన్‌పై దిగ్గజ ఆటగాడు సునీల్‌ గావస్కర్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతడి ప్రవర్తన నాయకుడి స్థాయికి తగ్గట్లుగా లేదని విమర్శించాడు.

"నేను ఆస్ట్రేలియన్‌ సెలెక్టర్‌ను కాకపోవచ్చు. కానీ సారథిగా పైన్‌కు రోజులు దగ్గర పడ్డాయి. ఆసీస్‌ దగ్గర అత్యుత్తమ బౌలింగ్‌ విభాగం ఉన్నప్పటికీ 130 ఓవర్లలోనూ టీమ్‌ఇండియాను ఆలౌట్‌ చేయలేకపోయారు. మెరుగైన బౌలింగ్‌ మార్పులు, ఫీల్డింగ్‌ మోహరింపులతో ఫలితం భిన్నంగా ఉండేది. బౌలింగ్‌.. ఫీల్డింగ్‌లో మార్పుల కంటే బ్యాట్స్‌మెన్‌తో మాట్లాడేందుకే పైన్‌ ఎక్కువ ఆసక్తి చూపించాడు. ఈ సిరీస్‌ తర్వాత ఆసీస్‌ సారథ్యంలో మార్పు చోటుచేసుకున్నా నేను ఆశ్చర్యపోను. రిషబ్‌ పంత్‌ అందించిన రెండు సులువైన క్యాచ్‌ల్ని పైన్‌ విడిచిపెట్టాడు. విహారి క్యాచ్‌ను మొదటి స్లిప్‌ ఫీల్డర్‌కు వదిలేయాల్సింది. అశ్విన్‌ను స్లెడ్జింగ్‌ చేసిన తర్వాత అతడి ఏకాగ్రత దెబ్బతింది. క్రికెట్‌ కాకుండా వేరే విషయాలు మాట్లాడటం ఒక జాతీయ జట్టు కెప్టెన్‌ స్థాయి కాదు. ప్రత్యర్థి జట్టుతో క్రికెట్‌ గురించి మాట్లాడొచ్చు. ఇబ్బంది పడుతున్న బ్యాట్స్‌మన్‌కు ఎలా ఆడాలో చెప్పొచ్చు. బాగా ఆడలేకపోతున్నావని అనొచ్చు. అవన్నీ క్రికెట్‌కు సంబంధించిన విషయాలు కాబట్టి ఆమోదం ఉంటుంది. అలాకాకుండా వేరే విషయాలు మాట్లాడితే నైరాశ్యంలో ఉన్నట్లు అర్థమవుతుంది. ప్రత్యర్థి పోరాటాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు స్పష్టమవుతుంది. ఆటపై ఏకాగ్రత నిలపాలి తప్ప అర్థంలేని విషయాలపై కాదు. అలాంటి వాటికి క్రికెట్లో తావులేదు"

-గావస్కర్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్

సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్టు చివరి రోజున ఆస్ట్రేలియా కెప్టెన్​ టిమ్​ పైన్​, టీమ్​ఇండియా స్పిన్నర్​ రవిచంద్రన్​ అశ్విన్​ల​ మధ్య మాటల యుద్ధం జరిగింది. అశ్విన్​ నిలకడగా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అతడ్ని ఏకాగ్రత దెబ్బ తీసేందుకు పైన్​ వ్యాఖ్యలు చేశాడు. దానికి బదులుగా తనదైన రీతిలో పైన్​కు స్వీట్​వార్నింగ్​ ఇచ్చాడు అశ్విన్.

Last Updated : Jan 12, 2021, 11:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.