రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు శుభవార్త. ఈ జట్టు యువ ఓపెనర్ దేవదత్ పడిక్కల్ ఇటీవలే కరోనా బారినపడి కోలుకున్నాడు. తాజాగా అతడు జట్టుతో కలిశాడు. దీంతో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్‌తో ఈ నెల 9న జరిగే తొలిపోరులో ఇతడు ఆడనున్నాడు.
-
Bold Diaries: Devdutt Padikkal joins the RCB camp after testing negative for COVID-19. He’s healthy, feeling better and raring to go. Here’s a message to all RCB fans from Devdutt.#PlayBold #WeAreChallengers #IPL2021 pic.twitter.com/BtVszNABJW
— Royal Challengers Bangalore (@RCBTweets) April 7, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Bold Diaries: Devdutt Padikkal joins the RCB camp after testing negative for COVID-19. He’s healthy, feeling better and raring to go. Here’s a message to all RCB fans from Devdutt.#PlayBold #WeAreChallengers #IPL2021 pic.twitter.com/BtVszNABJW
— Royal Challengers Bangalore (@RCBTweets) April 7, 2021Bold Diaries: Devdutt Padikkal joins the RCB camp after testing negative for COVID-19. He’s healthy, feeling better and raring to go. Here’s a message to all RCB fans from Devdutt.#PlayBold #WeAreChallengers #IPL2021 pic.twitter.com/BtVszNABJW
— Royal Challengers Bangalore (@RCBTweets) April 7, 2021
"రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లెఫ్ట్యాండ్ బ్యాట్స్‌మన్ దేవ్‌దత్ పడిక్కల్ జట్టుతో కలిశాడని తెలియజేయడానికి సంతోషంగా ఉంది. కరోనా పరీక్షల్లో నెగిటివ్ తేలడం వల్ల బీసీసీఐ నిబంధనల ప్రకారం అతడు జట్టుతో కలిశాడు."
-ఆర్సీబీ ట్వీట్
మార్చి 22న దేవ్‌దత్‌కు కరోనా సోకినప్పటి నుంచి క్వారంటైన్లో ఉన్నాడు. ఇటీవలే నెగిటివ్‌గా తేలడం వల్ల జట్టుతో కలిశాడు.
గత సీజన్లో ఆర్సీబీ తరఫున అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు దేవ్‌దత్. ఈ టోర్నీలో 15 మ్యాచ్‌ల్లో 473 పరుగులు సాధించాడు. అలాగే అరంగేట్రంలోనే 400కి పైగా పరుగులు సాధించిన రెండో క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు.
డేనియల్‌కు కరోనా
దేవ్‌దత్ పడిక్కల్ జట్టుతో కలవగా.. ఈ జట్టు ఆల్‌రౌండర్ డేనియల్ సామ్స్ కరోనా బారినపడ్డాడు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ తెలిపింది.