ఇంగ్లాండ్‌లో జరిగిన వరల్డ్‌కప్ ఫైనల్లో వివాదాస్పదంగా మారిన ఓవర్‌త్రోపై ఎంసీసీ(మెరిల్బోర్న్ క్రికెట్ క్లబ్) వరల్డ్ క్రికెట్ కమిటీ త్వరలో సమీక్షించనుంది. ఉత్కంఠగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ ఫీల్డర్ గప్తిల్ విసిరిన బంతి... ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్ బెన్‌స్టోక్స్ బ్యాట్‌కు తగిలి బౌండరీ వెళ్లింది. ఫలితంగా అంపైర్లు దాన్ని ఓవర్‌త్రో కింద పరిగణించి పరుగులు ఇచ్చారు. ఫలితంగా మ్యాచ్ టై అయి సూపర్ ఓవర్‌కు దారి తీసింది. ఆ తర్వాత సూపర్ ఓవర్ కూడా డ్రా అవడం వల్ల బౌండరీ కౌంట్ ఆధారంగా ఇంగ్లండ్ విజేతగా ఆవిర్భవించింది.
ప్రపంచకప్ ఫైనల్లో సూపర్ ఓవర్‌కు కారణమైన ఓవర్‌త్రో నిబంధన గురించి వరల్డ్ క్రికెట్ కమిటీ ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరగనున్న సమావేశంలో సమీక్షించనుంది. డబ్ల్యూసీసీ(వరల్డ్ క్రికెట్ కమిటీ) ప్యానల్‌లో ఉన్న మాజీ క్రికెటర్లు షేన్ వార్న్, కుమార సంగక్కరలు ఈ నిర్ణయం తీసుకున్నారు.
- ఓవర్‌త్రో గురించి వివరిస్తోన్న ఐసీసీ 19.8 నియమావళిని పరిశీలించనున్నారు. వీటితో పాటు అంపైర్ల తప్పుడు నిర్ణయాలు మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తున్నాయన్న విషయంపైనా చర్చించనున్నారు.
- 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చే అంశం, వరల్డ్‌కప్‌లో ఐపీఎల్ తరహా ప్లే ఆఫ్స్ నిర్వహణ, ఎవరికైనా ఆటగాడికి దెబ్బతగిలితే ప్లేయర్ రిప్లేస్‌మెంట్ చేసే అవకాశంపైనా సమాలోచనలు చేయనున్నారు.
ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైక్ గ్యాటింగ్ అధ్యక్షతన ఎమ్‌సీసీ వరల్డ్ క్రికెట్ కమిటీ రెండు రోజుల సమావేశం నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ హాజరవ్వాల్సి ఉన్నా.. వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోతున్నట్లు ఇదివరకే ప్రకటించాడు.
ఇవీ చూడండి...కామన్వెల్త్ గేమ్స్‌లో టీ-20 క్రికెట్