ETV Bharat / sports

రిజర్వు బెంచ్​ పటిష్ఠంగా ఉంది: కోహ్లీ

ఇంగ్లాండ్‌పై 3-1తో సిరీస్‌ గెలవడంపై టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ కీలక వ్యాఖ్యలు చేశాడు. జట్టు రిజర్వ్ బెంచ్​ పటిష్ఠంగా ఉందని ధీమా వ్యక్తం చేశాడు. మరోవైపు ఇంగ్లాండ్​ సారథి జో రూట్​ భారత్​తో సమంగా నిలవలేకపోయామని అన్నాడు.

author img

By

Published : Mar 6, 2021, 10:58 PM IST

Updated : Mar 7, 2021, 8:58 AM IST

Our bench strength is extremely strong says Kohli
'మా బెంచ్​ సామర్థ్యం పటిష్టంగా ఉంది:కోహ్లీ

భారత జట్టు రిజర్వ్​ బెంచ్​ పటిష్ఠంగా ఉండటం వల్ల టీమ్​ఇండియాకు మరింత బలం చేకూరిందని కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. శనివారం ఇంగ్లాండ్​పై టీమ్​ ఇండియా 3-1తో సిరీస్ గెలిచిన నేపథ్యంలో ఈ విధంగా మాట్లాడాడు.

"భారత జట్టు రిజర్వు బెంచ్​ పటిష్ఠంగా ఉంది. జట్టు సభ్యుల రొటేషన్​ జరిగినప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది. చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్​ అనంతరం టీమ్​ఇండియా చక్కటి ప్రదర్శన కనబరిచింది. రిషభ్​ పంత్, వాషింగ్టన్​ సుందర్ భాగస్వామ్యం జట్టు విజయంలో కీలకంగా మారింది. అశ్విన్​, అక్షర్​ అద్భుతంగా బౌలింగ్ చేశారు."

-విరాట్ కోహ్లీ, టీమ్​ఇండియా సారథి.

సమంగా నిలవలేకపోయాం..

భారత్​తో ఓటమిపాలైన నేపథ్యంలో ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ జో రూట్ స్పందించాడు. మొదటి టెస్ట్​లో బాగానే ఆడినా.. తర్వాత మూడు టెస్టుల్లో భారత్​కు తగిన పోటీ ఇవ్వలేకపోయామని అన్నాడు.

"కీలక సమయంలో టీమ్​ఇండియా రాణించింది. వాషింగ్టన్​ సుందర్, రిషభ్ పంత్​ గేమ్​ తీరునే మార్చేశారు. ఇంగ్లాండ్​ జట్టు అనుకున్న రీతిలో పరుగులు సాధించలేకపోయింది."

-జో రూట్, ఇంగ్లాండ్ కెప్టెన్.

ఇంగ్లాండ్​ రొటేషన్​ పద్ధతినీ జో రూట్​ వెనకేసుకొచ్చారు. ఆటగాళ్లను ఎంపిక చేసుకునేందుకు ఇది బాగా ఉపయోగపడుతుందని అన్నాడు.

ఇదీ చదవండి:'జాంబీల్లా మారిన టీమ్‌ఇండియా క్రికెటర్లు'

Last Updated : Mar 7, 2021, 8:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.