భారత్‌తో టెస్టులకు వార్నర్ లేకపోవడం, ఆస్ట్రేలియా బ్యాటింగ్‌కు పరీక్షలాంటిదని ప్రముఖ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. డిసెంబర్ 17న తొలి మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో స్మిత్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
వార్మప్ మ్యాచ్ ఆడుతూ ఆసీస్ యువ ఆటగాడు పుకోవిస్కీ కంకషన్‌కు గురయ్యాడు. కాబట్టి వార్నర్, పుకోవిస్కీ స్థానాల్లో జో బర్న్స్, మార్కస్ హారిస్ ఓపెనర్లుగా రానున్నారని స్మిత్ పేర్కొన్నాడు.
"టీమ్ఇండియా చాలా దృఢంగా ఉంది. గత పర్యటనలో వాళ్లు ఆసీస్‌ను ఓడించారు. అలానే ఇప్పుడు జట్టులోని చివరి ఆటగాడి వరకు మేం బాధ్యతగా ఆడతాం"
-స్టీవ్ స్మిత్, ఆస్ట్రేలియా ఆటగాడు.
బౌలర్లు మెరుగ్గా...
టీమ్ఇండియాలో మెరుగైన బౌలర్లు ఉన్నారని స్టీవ్ స్మిత్ అభిప్రాయపడ్డాడు. షమి, బుమ్రాతో పాటు స్పిన్నర్లు అశ్విన్, జడేజా, కుల్దీప్లతో జట్టు పటిష్టంగా ఉందని అన్నాడు. ఇషాంత్ శర్మ లేకపోవడం భారత్‌కు పెద్ద లోటని పేర్కొన్నాడు.