పాకిస్థాన్‌తో టెస్టు సిరీస్‌ను ఆస్ట్రేలియా.. 2-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేయడంపై ప్రశంసల వర్షం కురిపించాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్. అంతర్జాతీయ క్రికెట్లో కంగారూ జట్టు పూర్వవైభవం తెచ్చుకుంటోందని అన్నాడు. ప్రస్తుతం ఆసీస్‌ను వారి గడ్డపై ఓడించే సత్తా భారత్‌కు మాత్రమే ఉందని ట్వీట్ చేశాడు.
-
This Australian Team in these conditions are going to take some beating ... Only @BCCI #India have the tools to do so at this stage imo ... #AUSvPAK
— Michael Vaughan (@MichaelVaughan) December 2, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">This Australian Team in these conditions are going to take some beating ... Only @BCCI #India have the tools to do so at this stage imo ... #AUSvPAK
— Michael Vaughan (@MichaelVaughan) December 2, 2019This Australian Team in these conditions are going to take some beating ... Only @BCCI #India have the tools to do so at this stage imo ... #AUSvPAK
— Michael Vaughan (@MichaelVaughan) December 2, 2019
"ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై ఓడించే సత్తా ఉన్న జట్టు టీమిండియానే. భారత్‌కు అందుకు సరిపడా వనరులు సమృద్ధిగా ఉన్నాయి. ప్రస్తుతం పాక్‌తో జరిగిన టెస్టు సిరీస్ చూస్తేనే ఆసీస్ ఎంత బలంగా ఉందో తెలుస్తోంది" -మైఖేల్ వాన్, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్.
ఈ ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో విజయభేరీ మోగించింది టీమిండియా. ఆసీస్ గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్ కైవసం చేసుకొని సత్తాచాటింది. బాల్ ట్యాంపరింగ్ వివాదంతో ఈ సిరీస్‌కు వార్నర్, స్మిత్ దూరమయ్యారు.
అడిలైడ్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా.. ఇన్నింగ్స్ 48 పరుగుల తేడాతో గెలిచింది. రెండు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. డేవిడ్ వార్నర్.. తొలి టెస్టులో శతకంతో పాటు.. రెండో టెస్టులో ట్రిపుల్ సెంచరీ చేసి 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్'గా నిలిచాడు.
పాకిస్థాన్‌పై టెస్టు సిరీస్ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఆస్ట్రేలియా 176 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. ఈ మెగాటోర్నీ మొదలైన తర్వాత ఇప్పటివరకు 7 టెస్టులు ఆడింది కంగారూ జట్టు. 360 పాయింట్లతో టీమిండియా అగ్రస్థానంలో ఉంది.
ఇదీ చదవండి: స్టీవ్ స్మిత్‌ను టిమ్ పైన్ చిన్నచూపు చూస్తున్నాడా..!