పింక్-బాల్ టెస్టులతో స్టేడియాలకు అధికంగా ప్రేక్షకులను రాబట్టొచ్చని అంటున్నాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ. ప్రతి సిరీస్‌లో పింక్-బాల్ టెస్టును నిర్వహించడం వల్ల ఈ సుదీర్ఘ ఫార్మాట్‌కు విశేషమైన ఆదరణ లభిస్తుందని అభిప్రాయపడ్డాడు.
"ప్రతి సిరీస్‌లో కచ్చితంగా ఓ పింక్-బాల్ టెస్టును నిర్వహించాలి. ప్రతి జనరేషన్లో ఓ మార్పు ఉంటుంది. టెస్టు క్రికెట్‌కు పింక్-బాల్ టెస్టు కీలకమార్పు. దీని వల్ల సుదీర్ఘ ఫార్మాట్ ఇంకా ప్రేక్షకులలో బతికే ఉంటుంది."
- సౌరవ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు
పింక్-బాల్ టెస్టును మోతేరా స్టేడియంలో నిర్వహించడంపై గంగూలీ స్పందించాడు. "అహ్మదాబాద్ స్టేడియంలో దాదాపుగా టికెట్లన్నీ అమ్ముడయ్యాయి. నేను జై షాతో మాట్లాడాను. ఈ టెస్టుపై అతడు చాలా ఆసక్తిగా ఉన్నాడు. అహ్మదాబాద్‌లో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించి దాదాపుగా ఏడేళ్లు పూర్తయ్యింది. అతడి కోసమైనా కొత్త స్టేడియంలో మ్యాచ్‌లు నిర్వహించి.. కోల్‌కతా తరహాలో పింక్-బాల్ టెస్టుకు ప్రేక్షకులను ఆకర్షించడమే థ్యేయం. రెండు టెస్టులతో పాటు టీ20 సిరీస్‌కు సంబంధించిన టికెట్లు కూడా అమ్ముడయ్యాయి. అయితే తొలిటెస్టుకే ప్రేక్షకులను అనుమతించాలని మేము నిర్ణయించినా.. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ మాటకు కట్టుబడ్డాము. రెండోటెస్టుకు వీక్షకులను అనుమతించాం," అని గంగూలీ వెల్లడించాడు.
అహ్మదాబాద్‌లోని మోతేరా స్టేడియంలో టీమ్ఇండియా, ఇంగ్లాండ్ మధ్య ఫిబ్రవరి 24న పింక్-బాల్ టెస్టు జరగనుంది. ఈ మ్యాచ్‌కు వీక్షించేందుకు ప్రేక్షకులకు అనుమతినిచ్చారు. ఈ టెస్టుకు టికెట్లన్నీ అమ్ముడుపోయాయని గంగూలీ వెల్లడించాడు. ఇప్పటికే జరిగిన రెండు మ్యాచ్‌ల్లో ఇరు జట్లు చెరో టెస్టులో నెగ్గి సిరీస్‌ను సమం చేశాయి.
ఇదీ చూడండి: చెన్నై సూపర్‌కింగ్స్‌కు గంభీర్ సూచనలు