ETV Bharat / sports

బౌలర్లు భేష్.. తొలి వన్డేలో విజయం సూపర్: కోహ్లీ

ఇంగ్లాండ్​పై తొలి వన్డేలో విజయం సాధించడం పట్ల భారత సారథి కోహ్లీ సంతోషం వ్యక్తం చేశాడు. తమ బౌలర్లు పుంజుకున్న తీరును ప్రశంసించాడు.

One of the sweetest victories in the recent past in ODI cricket: india captain kohli
బౌలర్లు భేష్.. తొలి వన్డేలో విజయం సూపర్: కోహ్లీ
author img

By

Published : Mar 24, 2021, 7:22 AM IST

ఇంగ్లాండ్​తో తొలి వన్డేలో గెలవడంపై టీమ్​ఇండియా కెప్టెన్ కోహ్లీ ఆనందం వ్యక్తం చేశాడు. ఈ మధ్య కాలంలో వన్డేల్లో తమ జట్టుకు దక్కిన మధురమైన విజయం ఇది అని అన్నాడు.

"వన్డేల్లో ఈ మధ్య మేం ఎక్కువ మ్యాచ్​ల్లో గెలిచినా ఇంగ్లాండ్​పై తొలి వన్డేలో విజయం మాత్రం మాకు దక్కిన వాటిలో మధురమైనది. ప్రత్యర్థి జట్టు స్కోరు 135/1 ఉన్న దశ నుంచి, ఆ తర్వాత 116 పరుగుల వ్యవధిలో మిగతా 9 వికెట్లు తీసినందుకు మా బౌలర్ల కృషిని మెచ్చుకోవాలి. ప్రారంభంలో పరుగులు ఇచ్చినా సరే తర్వాత వారు(బౌలర్లు) పుంజుకున్న తీరు అభినందనీయం. ప్రస్తుతం నాకు చాలా గర్వంగా ఉంది" అని మ్యాచ్​ అనంతరం కోహ్లీ చెప్పాడు.

india vs england
ఇండియా-ఇంగ్లాండ్ తొలి వన్డే

పుణె వేదికగా మంగళవారం జరిగిన ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్​ఇండియా.. ధావన్(98), కోహ్లీ(56), కేఎల్ రాహుల్(62*), కృనాల్ పాండ్య(58*) అద్భుత ప్రదర్శనతో 317 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో ప్రారంభంలో ధాటిగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్.. తమ బ్యాట్స్​మెన్ విఫలమవడం వల్ల 42.1 ఓవర్లలో 251 పరుగులకే ఆలౌటైంది. దీంతో 1-0 తేడాతో సిరీస్​లో ఆధిక్యంలోకి వెళ్లింది కోహ్లీసేన.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.