ETV Bharat / sports

లాక్​డౌన్​ పెంపుతో ఐపీఎల్ మళ్లీ వాయిదా! - క్రికెట్ వార్తలు

భారత్​లో లాక్​డౌన్​ తేదీని పెంచడం వల్ల ఐపీఎల్​ను వాయిదా వేశారు. అయితే ఎప్పుడు ప్రారంభిస్తారనే విషయం గురించి మాత్రం వెల్లడించలేదు.

లాక్​డౌన్​ పెంపుతో ఐపీఎల్ మళ్లీ వాయిదా!
ధోనీ ఐపీఎల్
author img

By

Published : Apr 14, 2020, 1:55 PM IST

Updated : Apr 14, 2020, 2:45 PM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ మళ్లీ వాయిదా పడింది. ప్రధాని నరేంద్ర మోదీ.. భారత్​లో లాక్​డౌన్​ను మే 3 వరకు పెంచడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. అయితే ఈసారి ఎప్పటికి వాయిదా వేశారు. ఎప్పుడు ప్రారంభిస్తారు తదితర విషయాల్ని ప్రకటించలేదు.

మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఈ టోర్నీ.. కరోనా ప్రభావంతో ఏప్రిల్ 15కు వాయిదా పడింది. అయితే దేశంలో వైరస్​ వ్యాప్తి రోజురోజుకూ విస్తరిస్తున్న తరుణంతో ఐపీఎల్ నిర్వహణపై సందేహలు వ్యక్తమవుతున్నాయి. లీగ్​ను రద్దు చేయాలని, తర్వాత ఎప్పుడైనా నిర్వహించాలని పలువురు మాజీలు, ప్రస్తుత క్రికెటర్లు తమ అభిప్రాయల్ని వ్యక్తం చేస్తున్నారు.

Last Updated : Apr 14, 2020, 2:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.