సచిన్ తెందుల్కర్.. ఈ పేరు వినగానే లెక్కలేనన్ని రికార్డులు, క్రికెట్లో అత్యధిక పరుగులు గుర్తొస్తాయి. కానీ వన్డేల్లో అరంగేట్రం చేసిన అతడు.. తొలి సెంచరీ చేయడానికి ఐదేళ్లు పట్టిందంటే మీరు నమ్మగలరా? అవును ఇదే రోజు(1994 సెప్టెంబరు 9).. 26 ఏళ్ల క్రితం సింగర్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాపై తొలి శతకం నమోదు చేశాడు మాస్టర్.
-
How old were you when @sachin_rt scored his first ODI ton #OnThisDay in 1994?#OneFamily #MumbaiIndians #MI #Dream11IPLpic.twitter.com/LEanJ8DxTK
— Mumbai Indians (@mipaltan) September 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">How old were you when @sachin_rt scored his first ODI ton #OnThisDay in 1994?#OneFamily #MumbaiIndians #MI #Dream11IPLpic.twitter.com/LEanJ8DxTK
— Mumbai Indians (@mipaltan) September 9, 2020How old were you when @sachin_rt scored his first ODI ton #OnThisDay in 1994?#OneFamily #MumbaiIndians #MI #Dream11IPLpic.twitter.com/LEanJ8DxTK
— Mumbai Indians (@mipaltan) September 9, 2020
కొలంబో వేదికగా ఆస్ట్రేలియాతో మ్యాచ్. అది సచిన్ 78వ వన్డే. తొలుత టీమ్ఇండియా బ్యాటింగ్. ఓపెనర్‌గా వచ్చిన సచిన్, క్రీజులో బలంగా పాతుకుపోయాడు. మిగతా క్రికెటర్లందరూ స్వల్ప స్కోర్లకే పెవిలియన్‌కు పంపించేసిన ఆసీస్ బౌలర్లు.. మాస్టర్‌ను మాత్రం త్వరగా ఔట్ చేయలేకపోయారు. ఎట్టకేలకు 110 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అతడి వికెట్ తీయగలిగారు.
ఈ మ్యాచ్‌లో సచిన్ (110), కాంబ్లీ (43) భాగస్వామ్యంతో టీమ్ఇండియా, నిర్ణీత 50 ఓవర్లలో 246 పరుగులు చేసింది. ఛేదనలో ఆస్ట్రేలియా 47.2 ఓవర్లలో 215 పరుగులకే కుప్పకూలింది.
భారత బౌలర్లలో ప్రభాకర్ కేవలం 34 పరుగులకే మూడు వికెట్లు పడగొట్టాడు. రాజేశ్ చౌహాన్ రెండు వికెట్లు, కపిల్ దేవ్, రాజా, కుంబ్లే తలో వికెట్ తీశారు. అలా వన్డేల్లో తొలి శతకం కొట్టిన సచిన్.. అదే మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌నూ అందుకున్నాడు.
అనంతరం సిరీస్‌లో జరిగిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. మరోవైపు శ్రీలంక.. పాకిస్థాన్, ఆసీస్‌లను ఓడించింది. చివరికి భారత్-శ్రీలంక మధ్య మ్యాచ్ కూడా వర్షం కారణంగా 25 ఓవర్లకే కుదించారు. ఇందులో శ్రీలంక 98 పరుగులు చేయగా, అజారుద్దీన్ సేన ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది.
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తొలి సెంచరీ టీమ్ఇండియాకు ట్రోఫీని తెచ్చిపెట్టింది. అందువల్ల సెప్టెంబర్ 9.. సచిన్‌కు, అతడి అభిమానులకు, భారత క్రికెట్‌కు మరువలేని రోజుగా మిగిలిపోయింది.