సరిగా ఏడేళ్ల క్రితం ఇదే రోజున శ్రీలంక జట్టు పొట్టి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. టీ20 ఫార్మాట్లో ఇదే ఆ జట్టుకు తొలి వరల్డ్‌కప్. టీ20 కప్ గెలిచి ఏడేళ్లు అవుతున్న సందర్భంగా ఐసీసీ ట్విట్టర్లో నాటి మ్యాచ్ వీడియోను షేర్ చేసింది. ఐసీసీ ట్వీట్‌ను శ్రీలంక క్రికెట్ బోర్డు రీట్వీట్ చేసింది.
-
On this day, seven years ago🏆😍 #SLC #lka https://t.co/lVukWkInvd
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) April 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">On this day, seven years ago🏆😍 #SLC #lka https://t.co/lVukWkInvd
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) April 6, 2021On this day, seven years ago🏆😍 #SLC #lka https://t.co/lVukWkInvd
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) April 6, 2021
ఢాకాలోని షేర్ ఏ బంగ్లా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. ఆదిలోనే రహానె వికెట్ కోల్పోయిన భారత్‌ను.. రోహిత్, విరాట్ జోడీ ఆదుకుంది. రెండో వికెట్‌కు 60 రన్స్ జోడించింది. తర్వాత 29 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రోహిత్ ఔటయ్యాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన యువరాజ్.. జిడ్డు ఇన్నింగ్స్ ఆడాడు. 21 బంతుల్లో కేవలం 11 పరుగులు చేశాడు. దీంతో భారత్ రన్‌రేట్ దారుణంగా పడిపోయింది. కోహ్లీ 77 పరుగులు తీసినప్పటికీ టీమ్ఇండియా కేవలం 130 పరుగులే చేయగలిగింది. యువీ బ్యాటింగ్‌పై చాలా విమర్శలు వచ్చాయి. ఈ మ్యాచ్‌తో అపఖ్యాతి మూటగట్టుకున్నాడు యువీ.
ఇదీ చదవండి: ఈ నెల 21న స్టార్ షూటర్ నారంగ్ వివాహం
అనంతరం బరిలోకి దిగిన లంక 17.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓ దశలో 78 కే 4 వికెట్లు కోల్పోయిన లంకను.. కుమార సంగక్కర హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. జయవర్ధనే(24), తిసారా పెరీరా(23) ఆకట్టుకున్నారు.
ఈ ఏడాది పొట్టి వరల్డ్‌కప్‌కు భారత్ ఆతిథ్యమివ్వనుంది.
ఇదీ చదవండి: టోక్యో ఒలింపిక్స్‌కు ఉత్తర కొరియా దూరం!