టీ20 ప్రపంచకప్‌లో చివరి రెండు బెర్త్‌లను ఒమన్, స్కాట్లాండ్ జట్లు దక్కించుకున్నాయి. మెగాటోర్నీకి అర్హత సాధించాయి. దుబాయ్ వేదికగా జరిగిన క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో గెలిచి ప్రపంచకప్ ఆడనున్నాయి.
బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌ల్లో హాంకాంగ్‌పై 12 పరుగుల తేడాతో ఒమన్.. యూఏఈపై 90 పరుగుల తేడాతో స్కాట్లాండ్ జట్లు గెలుపొందాయి.


ఇప్పటికే చిన్న జట్లు నమీబియా, నెదర్లాండ్స్, పుపువా న్యూగినియా, ఐర్లాండ్‌లు.. టీ20 ప్రపంచకప్‌లో బెర్త్‌లు ఖరారు చేసుకున్నాయి. ఇంకా ఆతిథ్యమిచ్చిన యూఏఈ అర్హత సాధించింది.
వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకు టీ20 ప్రపంచకప్ జరగనుంది.
ఇది చదవండి: చెరగని రికార్డులు.. చరిత్రలో మిగిలే రివార్డులు వీరి సొంతం