ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో తీవ్ర ఒత్తిడిలోనూ టీమిండియా అద్భుతంగా ఆడిందని కితాబిచ్చాడు కోచ్ రవిశాస్తి. ఇదే ఉత్సాహంతో టీ20 ప్రపంచకప్ సాధించాలన్నదే తమ ముందున్న లక్ష్యమని తెలిపాడు.
"టాస్ గెలిచినా, ఓడినా.. పరిస్థితులకు అనుగుణంగా ఆడుతూ సత్తా చూపిస్తున్నాం. జట్టును విజయతీరాలకు చేర్చటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్‌లో జరిగే టీ20 ప్రపంచకప్ సాధించడానికీ అంతే పట్టుదలతో పనిచేస్తాం. 'నా' అనే పదానికి బదులుగా 'మన' అనే పదాన్ని అనుసరిస్తాం. అందుకే టీమిండియా విజయాన్ని అందరం కలసి వేడుకలా జరుపుకొంటాం. ఆటగాళ్లు ఒత్తిడిని జయించడం వల్లే ఆసీస్‌తో తొలి వన్డే ఓడినా.. మిగతా రెండింటిలో గెలిచి సిరీసే గెలిచాం."
- రవిశాస్త్రి, టీమిండియా కోచ్
పొట్టి ప్రపంచకప్ అందుకోవడానికి న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్‌లు మంచి వేదికలని అభిప్రాయపడ్డాడు రవిశాస్త్రి. జట్టులో సీనియర్ ఆటగాళ్లు గాయల బారిన పడటం బాధించినా.. వారి స్థానంలో వచ్చిన యువకులు జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ధావన్ గాయంతో జట్టుకు దూరమవడం కాస్త నిరాశపర్చిందని అన్నాడు శాస్త్రి.
జనవరి 24 నుంచి న్యూజిలాండ్‌పై అయిదు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది కోహ్లీసేన. మార్చిలో దక్షిణాఫ్రికాతోనూ అమీతుమీ తేల్చుకోనుంది.
ఇదీ చూడండి.. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టిదే