న్యూజిలాండ్ సీనియర్ క్రికెటర్ రాస్ టేలర్ అరుదైన ఘనత సాధించాడు. భారత్తో జరుగుతోన్న తొలి టెస్టు ఇతడికి 100వది. ఈ మ్యాచ్ ద్వారా అన్ని ఫార్మాట్లలో వంద మ్యాచ్లు ఆడిన ఏకైక ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఏ క్రికెటర్ ఈ ఘనత సాధించలేదు.
న్యూజిలాండ్ తరఫున వంద టెస్టులాడిన నాలుగో క్రికెటర్ టేలర్. ఇంతకుముందు డేనియల్ వెటోరీ (112), ఫ్లెమింగ్ (111), బ్రెండన్ మెక్కలమ్ (101) ఈ ఘనత సాధించారు. అలాగే కివీస్ తరఫున టెస్టుల్లో అత్యధిక సెంచరీలు (19) చేసిన రెండో క్రికెటర్గా కొనసాగుతున్నాడు. ఆ జట్టు ప్రస్తుత సారథి విలియమ్సన్ 21 శతకాలతో ముందున్నాడు.
ఇటీవలే టీ20ల్లోనూ వంద మ్యాచ్లను పూర్తి చేసుకున్న ఆటగాడిగా నిలిచాడు టేలర్. అలాగే న్యూజిలాండ్ తరఫున వన్డే, టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగానూ కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు టెస్టుల్లో 7,174, వన్డేల్లో 8,570 పరుగులు చేశాడు.