స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ను 3-2 తేడాతో న్యూజిలాండ్ కైవసం చేసుకుంది. వెల్లింగ్టన్లో జరిగిన నిర్ణయాత్మక ఐదో మ్యాచ్లో.. 7 వికెట్ల తేడాతో గెలుపొందింది కివీస్.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. నిర్ణీత ఓవర్లలో 142 పరుగులు మాత్రమే చేసింది. వేడ్(29 బంతుల్లో 44), కెప్టెన్ ఫించ్ (32 బంతుల్లో 36) ఫర్వాలేదనిపించారు. ఇష్ సోథి 3, సౌథీ 2, బౌల్ట్ 2 వికెట్లతో ఫించ్ సేనను తక్కువ పరుగులకే కట్టడి చేశారు.
అనంతరం బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్.. 15.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని సులభంగా అందుకుంది. మార్టిన్ గప్తిల్ మరోసారి రాణించాడు. హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన గప్తిల్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించింది. బౌలర్ ఇష్ సోథికి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ దక్కింది.
ఇదీ చదవండి: వారసత్వం వదిలి వెళ్లాలనే: యాష్