ETV Bharat / sports

షెఫాలీకి ఛాలెంజ్​ విసిరిన ఇంగ్లాండ్ క్రికెటర్​ - షెఫాలీ వర్మ న్యూస్​

టీమిండియా యువక్రీడాకారిణి షెఫాలీ వర్మకు సోషల్​ మీడియాలో ఇంగ్లాండ్​ క్రీడాకారిణి డేనియల్​ వ్యాట్​ సవాల్​ విసిరింది. 'టాయ్​లెట్​ రోల్ ​ఛాలెంజ్'​లో భాగం కావాలని ఆమెను ఆహ్వానించింది.

#ToiletRollChallenge: Danielle Wyatt Challenges to Shafali verma on her Instagram
షఫాలీవర్మను ఛాలెంజ్​ చేసిన డేనియల్​ వ్యాట్​
author img

By

Published : Mar 22, 2020, 12:44 PM IST

కరోనా వైరస్​ వ్యాప్తి కారణంగా క్రీడాకారులకు తాత్కాలిక విరామం లభించింది. ఈ నేపథ్యంలో కొత్త ఛాలెంజ్​లతో ఒకర్నొకరు ఛాలెంజ్ చేసుకుంటున్నారు. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న 'టాయ్​లెట్ ​రోల్ ​ఛాలెంజ్'​లో పలువురు క్రీడాకారులు భాగమవుతున్నారు. ఇందుకోసం టాయ్​లెట్​ పేపర్​ రోల్​ను ఫుట్​బాల్​ లాగా గాలిలో లేపాలి.. ఈ విధంగా ఎంత సమయం గాలిలో ఉంచుతారో అనేది ఛాలెంజ్​. తాజాగా ఇంగ్లాండ్​ మహిళా క్రికెటర్ డేనియల్​ వ్యాట్​ ఈ ఛాలెంజ్​ను చేసి వీడియోను పోస్ట్​ చేసింది.

ఈ ఛాలెంజ్​కు తనను ఆహ్వానించిన ఇంగ్లాండ్​ క్రికెటర్​ జార్జియా ఆడమ్స్​కు ధన్యవాదాలు తెలిపింది డేనియల్​. అలాగే టీమిండియా యువ క్రీడాకారిణి షెఫాలీవర్మ, ఫ్రాన్​ విల్సన్​లను ఈ ఛాలెంజ్​కు నామినేట్ చేసింది.

డేనియల్​ వ్యాట్.. ఈ ఏడాది జరిగిన టీ20 మహిళా ప్రపంచకప్​లో ఆడింది. టీమిండియాతో జరగాల్సి ఉన్న సెమీఫైనల్​ రద్దవ్వటం వల్ల ఇంగ్లీష్​ జట్టు ఇంటిదారి పట్టింది. ​ఈ ఏడాది జూన్​లో టీమిండియా, ఇంగ్లాండ్​ జట్ల మధ్య వన్డే సిరీస్​ జరగనుంది.

ఇదీ చూడండి.. ఐపీఎల్​లో ఆర్సీబీ జట్టుకు ఆడతా: ఛెత్రి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.