టీమిండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ప్రదర్శనపై కొన్ని రోజులుగా వస్తున్న విమర్శలపై ఇషాంత్‌శర్మ స్పందించాడు. కొన్ని మ్యాచ్‌లు చూసి అతడిపై ఓ అంచనాకు రావొద్దన్నాడు.
"ఒక్క ఇన్నింగ్స్‌కే బుమ్రాను ఎలా అంచనా వేయగలుగుతున్నారు. రెండేళ్లలో అతడి ప్రదర్శన మర్చిపోయారా? గతంలో జరిగిన ప్రతి టెస్టులో బుమ్రా, షమి, జడేజా, నేను కలిసి 20 వికెట్లను సునాయసంగా పడగొట్టాం. ఈ విషయాన్ని ఎలా మరిచారు. బుమ్రా ప్రదర్శన పట్ల నాకెలాంటి అనుమానం లేదు. జట్టుకు విజయాన్ని అందిచటంలో అనేక సార్లు బాధ్యత వహించాడు. అతడు కచ్చితంగా రాణిస్తాడని నమ్మకం నాకుంది"
- ఇషాంత్ శర్మ, టీమిండియా బౌలర్
కివీస్‌తో జరుగుతోన్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇప్పటికే మూడు వికెట్లను సాధించాడు ఇషాంత్.
గతవారం మహ్మద్‌షమి ఇదే విషయంపై స్పందించాడు. రెండు మ్యాచ్‌ల ప్రదర్శనతో బుమ్రా ఆటతీరు అంచనా వేయలేరని అన్నాడు. దీనిపై కివీస్ బౌలర్ టిమ్ సౌథీ, బుమ్రాకు మద్దతు పలికాడు. కొన్ని మ్యాచ్‌ల నుంచి వికెట్ సాధించకపోయినా అతడి ప్రదర్శన సంతృప్తి కరంగా ఉందన్నాడు.
ఇదీ చూడండి.. దక్షిణాఫ్రికాలో స్టీవ్‌స్మిత్‌కు మళ్లీ సాండ్‌పేపర్ గోల