ETV Bharat / sports

'కోహ్లీ లేకున్నా ఫలితాల్లో పెద్ద తేడా ఏమీ ఉండదు' - kohli absence test series cummins

టెస్ట్​ సిరీస్​కు టీమ్​ఇండియా సారథి కోహ్లీ దూరమైనప్పటికీ మ్యాచ్​ ఫలితాల్లో పెద్దగా తేడా ఏమీ ఉండని అన్నాడు ఆసీస్​ బౌలర్​ కమిన్స్​. ఆ స్థానం గొప్పగా ఆడే మరో క్రికెటర్​తో భర్తీ అవుతుందని చెప్పాడు.

kohli
కోహ్లీ
author img

By

Published : Nov 17, 2020, 5:30 AM IST

ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్​ సిరీస్​లో భాగంగా చివరి మూడు మ్యాచ్​లకు టీమ్​ఇండియా సారథి కోహ్లీ దూరంకానున్న విషయమై స్పందించాడు ఆసీస్​ ఆటగాడు ప్యాట్​కమిన్స్​. దీని వల్ల పెద్ద నష్టమేమి లేదన్నాడు. విరాట్​కు ప్రత్యామ్నయంగా బాగా ఆడే ఆటగాడితో ఆ స్థానం భర్తీ అవుతుందని చెప్పాడు. కోహ్లీ ఉన్నా లేకున్నా.. నాలుగు టెస్టు మ్యాచుల ఫలితాల్లో పెద్దగా తేడా ఏమీ ఉండదని అన్నాడు.

"విరాట్​ టెస్ట్​ మ్యాచ్​లకు దూరం కావచ్చు. కానీ ఆ స్థానం మరో గొప్ప ఆటగాడితో భర్తీ అవుతుంది. అవకాశం కోసం ఎదురుచూస్తోన్న ఏదో ఓ ఆటగాడికి జట్టులో స్థానం లభిస్తుంది. ఆ అవకాశమే అతడి కెరీర్​ను మలుపు తిరిగేందుకు నాంది పలుకుతుంది. విరాట్​ లేనంత మాత్రానా మ్యాచ్​ ఫలితాల్లో పెద్దగా తేడా కూడా ఉండదు. 2018లో భారత్​ మా గడ్డపై అద్భుతంగా ఆడింది. ఈ సారి మేము నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. ఇరు జట్ల మధ్య హోరాహోరీగా పోరు జరుగుతుంది."

-ప్యాట్​ కమిన్స్​, ఆస్ట్రేలియా ఆటగాడు.

నవంబరు 27 నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటనలో భారత్- ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు జరగనున్నాయి.

ఇదీ చూడండి : 'బ్లాక్​ లైవ్స్​ మేటర్​​​'కు ఆసీస్ జట్టు​ మద్దతు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.