ETV Bharat / sports

'టీమిండియా బౌలర్​ అశ్విన్​ గొప్ప స్పిన్నర్​ కానీ?' - క్రికెటర్ రవిచంద్రన్‌​ అశ్విన్

టీమిండియా బౌలర్‌​ అశ్విన్​ గొప్ప స్పిన్నర్​ కానీ అన్ని పరిస్థితుల్లో అలా రాణించలేడని చెప్పాడు ఆస్ట్రేలియా క్రికెటర్‌ బ్రాడ్‌ హాగ్‌. ఆసీస్​ స్పిన్నర్​ నాథన్‌ లైయన్..‌ సుదీర్ఘ ఫార్మాట్‌లోనూ అత్యుత్తమ ప్రదర్శన చేయగలడన్నాడు.

Not Ravichandran Ashwin but Nathan Lyon is best Test off-spinner now, says Brad Hogg
క్రికెటర్​ అశ్విన్​ గొప్ప స్పిన్నర్​ కానీ...
author img

By

Published : Apr 11, 2020, 8:32 PM IST

Updated : Apr 11, 2020, 10:04 PM IST

టీమిండియా సీనియర్‌ ఆటగాడు రవిచంద్రన్‌ అశ్విన్‌ గొప్ప ఆఫ్ స్పిన్నర్‌ అని, అయితే సుదీర్ఘ ఫార్మాట్‌లో ఆస్ట్రేలియా స్పిన్నర్‌ నాథన్‌ లైయన్‌ అత్యుత్తమని ఆ దేశ క్రికెటర్‌ బ్రాడ్‌ హాగ్‌ అభిప్రాయపడ్డాడు. ఆసీస్‌ తరఫున 123 వన్డేలు, 7 టెస్టులు ఆడిన హాగ్‌.. ట్విటర్‌లో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు శనివారం సమాధానమిచ్చాడు.

"గత ఏడాది నుంచి అశ్విన్‌ కంటే ఉత్తమ ఆఫ్‌స్పిన్నర్‌గా లైయన్‌ నిలుస్తున్నాడు. అయితే ఇద్దరూ గొప్ప బౌలర్లే. తమ ఆటతీరుపై సంతృప్తి చెందకుండా బౌలింగ్‌లో మరింత మెరుగువ్వాలని ప్రయత్నిస్తుంటారు" అని హాగ్‌ చెప్పుకొచ్చాడు.

లైయన్‌ అన్ని పరిస్థితుల్లో సత్తాచాటుతాడని, అశ్విన్‌ విదేశాల్లో గొప్పగా రాణించలేడని హాగ్ పేర్కొన్నాడు. 71 టెస్టులు ఆడిన అశ్విన్‌.. 365 వికెట్లు సాధించగా, లైయన్..‌ 96 టెస్టుల్లో 390 వికెట్లు పడగొట్టాడు.

ఇదీ చూడండి : ఆన్​లైన్​ శిక్షణ ఇస్తూ ధోనీ, అశ్విన్ బిజీ బిజీ

Last Updated : Apr 11, 2020, 10:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.