కరోనావైరస్ కారణంగా క్రీడాకారుల వేతనాల్లో కోత ఉంటుందని జరుగుతున్న ప్రచారంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అధికారి స్పందించాడు. భారత క్రికెటర్ల జీతాలలో ప్రస్తుతం అలాంటి కోతలేమి లేవని బీసీసీఐ కోశాధికారి అరుణ్ధుమాల్ స్పష్టం చేశాడు. ఈ మహమ్మారి కారణంగా భారీ నష్టం రావటం వాస్తవమే కానీ, ఆటగాళ్ల జీతాలను తగ్గించాలన్న ఆలోచన లేదని తెలిపాడు.
ఇటీవలే బార్సిలోనా క్లబ్‌లోని ఫుట్‌బాల్ ఆటగాళ్లకు ఇచ్చే వేతనంలో కోత ఉంటుందని ఆ క్లబ్ నిర్ణయించింది. దీనిపై లియోనెల్ మెస్సీ సంతోషంగా లేడని కొన్ని నివేదికలు తెలిపాయి. కానీ, తాజా పరిణామాలకు అనుగుణంగా తమ వేతనాల్లో కోతను అంగీకరిస్తున్నట్టు అతడు తెలిపాడు. అదే విధంగా క్లబ్‌కు ఏదైనా అవసరం వస్తే ముందుండి సహాయం చేసే మొదటి వ్యక్తి తానేనని వెల్లడించాడు.
ఇదీ చూడండి.. పాక్‌పై చివర్లో సిక్స్.. గుర్తు చేసుకున్న భజ్జీ