'వద్దు సార్.. అతడు జట్టును చెడగొడతాడు'.. ఓ స్టార్ ఆటగాణ్ని జట్టులోకి తీసుకుందామని చెన్నై సూపర్‌కింగ్స్ యజమాని శ్రీనివాసన్ అన్నప్పుడు.. ఆ జట్టు కెప్టెన్ ధోని స్పందనిది. ఓ వెబినార్‌లో మాట్లాడుతూ శ్రీనివాసనే ఈ విషయం చెప్పాడు.
"చెన్నై సూపర్‌కింగ్స్‌లోకి తీసుకోవడం కోసం ఓ అగ్రశ్రేణి ఆటగాడి పేరును ధోనీకి మేం సూచించాం. 'వద్దు సార్.. అతడు జట్టును చెడగొడతాడు' అని అతడు అన్నాడు. జట్టు ఐక్యంగా ఉండడం ముఖ్యం. అమెరికాలో చాలా ఏళ్లుగా ఫ్రాంఛైజీ కేంద్రంగా ఆటలు నడుస్తున్నాయి. భారత్‌లో ఇప్పుడిప్పుడే అది మొదలైంది. అయితే జూనియర్ స్థాయిలో జట్లను నడిపించిన అనుభవం ఇండియా సిమెంట్స్‌కు ఉంది" అని శ్రీనివాసన్ చెప్పాడు.