ETV Bharat / sports

రోహిత్​లా ఎవరూ ఆడలేరు: కోహ్లీ కోచ్​ - కోహ్లీ కోచ్​ రాజ్​కుమార్​ శర్మ వార్తలు

టీమ్​ఇండియాలో రోహిత్​ శర్మ లాంటి బ్యాట్స్​మన్​ చేరడం వల్ల జట్టులో ఉత్సాహం రెట్టింపు అయిందని కోహ్లీ చిన్ననాటి కోచ్​ రాజ్​కుమార్​ శర్మ అభిప్రాయపడ్డాడు. ఉమేశ్​ యాదవ్​ స్థానంలో యువ బౌలర్​ నవదీప్​ సైనీని ఎంపిక చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు.

No one plays the hook or pull shot better than Rohit in the team: Rajkumar Sharma
రోహిత్​ శర్మ మాదిరిగా ఎవరూ ఆడలేరు: కోహ్లీ కోచ్​
author img

By

Published : Jan 6, 2021, 4:31 PM IST

ఆస్ట్రేలియాతో జరగనున్న మూడో టెస్టు తుది జట్టు కూర్పుపై కోహ్లీ చిన్ననాటి కోచ్​ రాజ్​కుమార్​ శర్మ స్పందించాడు. రోహిత్ ​శర్మ లాంటి బ్యాట్స్​మన్​ జట్టులో చేరడం వల్ల టీమ్​ఇండియా శిబిరంలో మరింత ఉత్సాహం వచ్చిందని అన్నాడు. అలాగే టెస్టు ఫార్మాట్​లో నిలకడగా బౌలింగ్ చేసేందుకు నవదీప్​ సైనీ సరైన ఎంపిక అని తెలిపాడు.

"రోహిత్​ శర్మ లాంటి బ్యాట్స్​మన్​ జట్టులో చేరడం టీమ్​ఇండియాకు కొత్త ఉత్సహాన్ని తెస్తుంది. అతడి లాగా హుక్​ షాట్లు, పుల్​షాట్లు ఆడే ఆటగాడు జట్టులో లేడు. ఆస్ట్రేలియా బౌలర్లను రోహిత్ ధీటుగా ఎదుర్కోగలడు".

- రాజ్​కుమార్​ శర్మ, కోహ్లీ చిన్ననాటి కోచ్​

సిడ్నీ వేదికగా జరగనున్న మూడో టెస్టుతో టీమ్ఇండియా బౌలర్​ నవదీప్​ సైనీ సుదీర్ఘ ఫార్మాట్​లో అరంగేట్రం చేయనున్నాడు. ఇటీవలే గాయం కారణంగా సిరీస్​ నుంచి వైదొలగిన ఉమేశ్​ యాదవ్​ స్థానంలో సైనీని ఎంచుకున్నారు. సుదీర్ఘంగా బౌలింగ్​ చేయాల్సిన క్రమంలో సైనీ అందుకు సరైన ఎంపిక అని కోహ్లీ కోచ్​ రాజ్​కుమార్​ శర్మ అభిప్రాయపడ్డాడు.

"శార్దూల్​ ఠాకూర్​, నటరాజన్​తో పోలిస్తే సైనీ గంటకు 140 కిలోమీటర్ల వేగంతో నిలకడగా బౌలింగ్​ చేయగలడు. సుదీర్ఘ ఫార్మాట్​లో సైనీతో జట్టుకు మరింత ప్రయోజనం. అలాగే రంజీట్రోఫీలోనూ సైనీకి అనుభవం ఉంది. ఈ అవకాశాన్ని అతను అందిపుచ్చుకుంటాడని భావిస్తున్నా" అని కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్​కుమార్​ శర్మ చెప్పాడు.

భారత్​, ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న నాలుగు మ్యాచ్​ల టెస్టు సిరీస్​లో ఇరుజట్లు చెరో మ్యాచ్​ గెలిచి సిరీస్​ను సమం చేశాయి. గురువారం (జనవరి 7) సిడ్నీ వేదికగా మూడో టెస్టు ప్రారంభంకానుంది.

ఇదీచూడండి: కపిల్​దేవ్ బర్త్​డే: ప్రముఖుల శుభాకాంక్షల వెల్లువ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.