ETV Bharat / sports

'గంగూలీకి బైపాస్​ సర్జరీ అవసరం లేదు' - గంగూలీకి బైపాస్​ సర్జరీ

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్​ గంగూలీ ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు కోల్​కతాలోని వుడ్​ల్యాండ్స్​ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. దాదాకు బైపాస్​ సర్జరీ చేయాల్సిన అవసరం లేదని వారు స్పష్టం చేశారు.

No need of bypass surgery for Sourav Ganguly, say doctors
'గంగూలీకి బైపాస్​ సర్జరీ అవసరం లేదు'
author img

By

Published : Jan 3, 2021, 4:36 PM IST

గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్​ గంగూలీ ఆరోగ్య పరిస్థితిని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. గంగూలీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని.. ఆయనకు బైపాస్​ సర్జరీ అవసరం లేదని డాక్టర్లు స్పష్టం చేశారు. గుండెకు సంబంధించిన రెండు రక్తనాళాల్లో ఇంకా పూడిక ఉందని.. దానివల్ల మరోసారి యాంజియోప్లాస్టీ చేయాల్సి ఉంటుందని వారు వెల్లడించారు.

శనివారం ఉదయం జిమ్‌లో ఉండగా గంగూలీకి గుండెనొప్పి వచ్చింది. కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు. గంగూలీకి, తదుపరి చికిత్స అంశంపై సోమవారం మెడికల్‌ బోర్డు సమావేశమవుతుందని వుడ్‌ల్యాండ్స్‌ హాస్పిటల్‌ పేర్కొంది.

ఇదీ చూడండి:

ఛాతినొప్పితో ఆస్పత్రిలో చేరిన బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ

దాదాకు యాంజియోప్లాస్టీ విజయవంతం

గంగూలీ హెల్త్ అప్​డేట్.. మెరుగ్గా ఆరోగ్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.