ఆస్ట్రేలియా, టీమ్ఇండియా మూడో టెస్టును సిడ్నీలోనే నిర్వహిస్తామని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. అయితే సిడ్నీ పరిసర ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మ్యాచ్‌కు వచ్చే ప్రేక్షకులు, స్టాండ్స్‌లో తగిన జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య అధికారులు సూచిస్తున్నారు. ఆ రాష్ట్ర ఆరోగ్య అధికారుల సూచన మేరకు ఈ మ్యాచ్‌కు 50 శాతం మంది ప్రేక్షకులనే అనుమతించాలని క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయించిదట.
"సిడ్నీ మైదానంలో అడుగుపెట్టే ప్రతి ఒక్కరికి మేం మాస్క్‌లు అందజేసి.. సీటులో ఉన్నప్పుడు తప్ప మిగిలిన సమయంలో మాస్క్ ధరించమని సూచిస్తాం. మ్యాచ్ మధ్యలో ప్రేక్షకులంతా కలిసి సంబరాలు చేసుకోవద్దని చెబుతాం" అని న్యూ సౌత్‌వేల్స్ ఆరోగ్య అధికారి కేరీ చంట్ బుధవారం జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
వారం రోజులుగా సిడ్నీ పరిసర ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో మూడో టెస్టు నిర్వహణపై సందేహాలు వచ్చాయి. అయితే ఆ మ్యాచ్‌ను అక్కడే నిర్వహిస్తామని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. దీంతో పాటే స్టేడియానికి వచ్చే ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించేలా జాగ్రత్త తీసుకుంటామని తెలిపింది. వన్డే సిరీస్లానే ఈ మ్యాచ్‌కు 50 శాతం మందిని మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: సిడ్నీలోనే మూడో టెస్టు..ఆసీస్ బోర్డు ట్వీట్