ఐపీఎల్ రాత్రి మ్యాచ్ ప్రారంభ సమయాన్ని అరగంట ముందుకు జరపాలన్న విషయంపై ఐపీఎల్ పాలకమండలి విముఖత వ్యక్తం చేసింది. ముందు సీజన్ల మాదిరిగానే రాత్రి 8 గంటలకే మ్యాచ్‌లు ప్రారంభమవుతాయని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ స్పష్టం చేశాడు.
"ఐపీఎల్ రాత్రి మ్యాచ్ సమయంలో ఎలాంటి మార్పు లేదు. ఇంతకుముందులానే 8 గంటలకే మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. 7.30కు ప్రారంభించాలన్న ప్రతిపాదన ప్రస్తుతానికి అమలు కావట్లేదు. మొదటి మ్యాచ్ 4 గంటలకు, రెండో మ్యాచ్ 8 గంటలకు మొదలవుతాయి."
-సౌరభ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు
అలాగే ఐపీఎల్ ఫైనల్ వేదికపైనా స్పష్టతనిచ్చాడు గంగూలీ. తుదిపోరు ముంబయిలోనే జరుగుతుందని తెలిపాడు. అహ్మదాబాద్‌లో జరుగుతుందున్న వార్తల్లో వాస్తవం లేదని అన్నాడు.
ఇవీ చూడండి.. దేశవాళీ క్రికెట్‌ను దిగజారుస్తున్నారు: గావస్కర్