న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ అద్భుతమైన బ్యాట్స్‌మెన్. జట్టుకు అవసరమైన సమయంలో బౌలింగ్‌తోనూ రాణించగలడు. అయితే ఈ ఏడాది ఆగస్టులో అతడి బౌలింగ్ యాక్షన్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలికి ఫిర్యాదులు అందాయి. వాటిపై విచారణ చేపట్టిన ఐసీసీ... అతడి బౌలింగ్ శైలి నిబంధనలకు లోబడే ఉన్నట్లు చెప్పింది. విలియమ్సన్ బౌలింగ్ సరిగ్గానే ఉందని శుక్రవారం ఓ ప‍్రకటన విడుదల చేసింది. అంతర్జాతీయ క్రికెట్లో అతడు ఆఫ్ స్పిన్ బౌలింగ్‌ను కొనసాగించుకోవచ్చని తెలిపింది.
అంపైర్లకూ అనుమానం...
గాలే వేదికగా శ్రీలంకతో ఆగస్టు 14 నుంచి 18 వరకు జరిగిన తొలి టెస్టులో విలియమ్సన్ బౌలింగ్ యాక్షన్‌పై అనుమానాలు వచ్చాయి. ఇందులో భాగంగా ఫీల్డ్ అంపైర్లు అందించిన నివేదిక ఆధారంగా మ్యాచ్ రిఫరీ ఈ విషయాన్ని ఐసీసీకి తెలిపాడు. దీనిపై విచారణ జరిపింది. విలియమ్సన్ తన మోచేతిని 15 డిగ్రీలోపే వంచుతున్నాడని.. ఫలితంగా అతడు తన ఆఫ్ స్పిన్‌ను యథావిధిగా కొనసాగించవచ్చని పేర్కొంది ఐసీసీ.
2014 జులైలోనూ ఈ ఆటగాడి బౌలింగ్ శైలిపై సస్పెన్షన్ విధించింది ఐసీసీ. కొన్ని మార్పులు చేసుకున్న తర్వాత మళ్లీ డిసెంబరులో అనుమతి ఇచ్చింది.
ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో న్యూజిలాండ్ ఓడింది. ఐదు టీ20ల సిరీస్‌లో 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ గెలిచింది. ఈ మ్యాచ్‌కు విలియమ్సన్, పేసర్ ట్రెంట్ బౌల్ట్‌కు విశ్రాంతి నిచ్చింది కివీస్ యాజమాన్యం.